విజయనగరం

జాతీయ రహదారి విస్తరణకు రూ. 27 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 7: జిల్లాలో ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. జాతీయ రహదారులపై పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులను ముఖ్యమైన ప్రాంతాలలో విస్తరించేందుకు కేంద్రం నుండి పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు శ్రద్ధ తీసుకుని కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పించి అనుమతులు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా ప్రయాణికులు, వాహనాల త్వరతగతిన గమ్యం చేరుకునేలా విజయనగరం పట్టణం ప్రదీప్‌నగర్ కూడలి నుండి గొట్లాం వరకు 26వ నెంబరు జాతీయ రహదారిని నాలుగు లై న్లుగా విస్తరించేందుకు 17 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో నిధులు మంజూరు చేసారు. రెండువైపులాఫుట్‌పాత్‌లు, కాలువలు, సెంట్రల్ డివైడర్ వ్యవస్థతో ఈ నాలుగు లైన్ల విస్తరణ పనులు చేయనున్నారు. అదేవిధంగా పదికోట్ల రూపాయలతో గజపతినగరం ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఎత్తుబ్రిడ్జి వద్ద అదనపు బ్రిడ్జి మంజూరు చేశారు.