విజయనగరం

ఉద్యాన పంటలను ప్రోత్సహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 9: ఉద్యాన పంటలను సాగుచేసే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన శాఖ, మైక్రో ఇరిగేషన్ అధికారులతో జిల్లాలో కూరగాయల పంటలు, బిందుసేధ్యం, సూక్ష్మ సేధ్యం ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచాలని స్పష్టంచేసారు. రైతులు వివరాలు, భూమి వివరాలు సేకరించి ఉద్యాన పంటలను విరివిగా ప్రోత్సహించాలని అన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు కూరగాయలు పెంచేందుకు పెండాల్ రైతులకు మంజూరు చేయాలని తెలిపారు. అల్లం, కొబ్బరి అంతర్ పంటలు సాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. మార్కెట్‌కు అనుగుణంగా పంటలు పండిస్తే రైతుకు గిట్టుబాటు అవుతుందని తెలిపారు. తొమ్మిదివేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్, ఐటిడి ఎ పరిధిలో ఐదువేల హెక్టార్లలో ఉద్యాన పంటలను సాగుచేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈసమావేశంలో మైక్రో ఇరిగేషన్ పిడి లక్ష్మినారాయణ, ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్ పాల్గొన్నారు.