విజయనగరం

కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 10: తుని ఘటనలో బాధ్యులుగా భావించి అరెస్టుచేసిన కాపునాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చనమల్లు ప్రసాదరావు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమేనని అయితే ముద్రగడ దీక్ష సందర్భంలో త్రిమెన్ కమిటీ ఇచ్చిన హామీ మేరకు కేసులు పెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథన్ కమిటీ ఇంతవరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేయలేదన్నారు. కాపుకార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇంతవరకు 2400 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 400 మందికి రుణాలు ఇచ్చారని తెలిపారు. కాపుల విషయంలో ప్రభుత్వం అన్ని చేస్తామని చెబుతూనే అరెస్టుల పర్వానికి తెరతీయడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శనివారం కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో తెలగ సంక్షేమ సంఘం సభ్యుడు చిక్కాల జనార్థనరావు, సభ్యులు శ్రీనివాసరావు, మురళీమోహనరావు, కొమ్మూరి శ్రీధర్ పాల్గొన్నారు.