విజయనగరం

అంతర్జాతీయ స్కేటింగ్ రింక్ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 13: పట్టణంలో విజ్జీస్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ స్కేటింగ్ రింక్, గ్యాలరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాల ని కేంద్ర పౌరవిమానయానశాఖ మం త్రి పి.అశోక్‌గజపతిరాజు ఆదేశించారు. విజ్జీస్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ స్టేడియంలో క్రీడాకారుల కోసం వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అంతర్జాతీయ స్కే టింగ్ రింక్, గ్యాలరీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. స్టేడియంలో విద్యుత్ సదుపాయంతోపాటు రెండు కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్, 600 మీటర్ల వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటుచేయాల న్నారు. అన్ని రకాల క్రీడల కోసం కోర్టులను నిర్మించాలని తెలిపారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ విజ్జీస్టేడియంలో కోటి 50 లక్షల రూపాయలతో అంతర్జాతీయ స్టేటింగ్ రింక్, గ్యాలరీ పనులు చేపడతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, వుడా డిప్యూటీ ఇంజనీర్ ఎస్‌విఎస్‌ఎన్‌రాజు, అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్‌వి సత్యనారాయణ పాల్గొన్నారు.

ప్రాచీన శిల్పకళను రక్షించుకోవాలి
విజయనగరం(పూల్‌బాగ్),జూన్ 13: భారతీయ ప్రాచీన శిల్పకళను పరిరక్షించుకోవాలని కేంద్ర విమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు.కొత్తపేటలోని మన్నార్‌రాజగోపాలస్వామి ఆలయాన్ని సోమవారం ఆయన దర్శించారు. ఈసందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ అద్భుతమైన శిల్పకళను మనపూర్వీకులు మనకు అందించారని, అటువంటి శిల్పకళను కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా అశోక్‌గజపతి దంపతులను ఆలయ వేదపండితులు సంప్రదాయానుసారం వేదమంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రిదంపతుల పేరిట ప్రత్యేకపూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రమణ, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మాటూరు సతీష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.