విజయనగరం

ప్రజారోగ్యం పట్టని పాలకవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగ్రం (టౌన్), జూలై 5: ము న్సిపల్ పాల క వర్గానికి పట్టణ ప్ర జల ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గా డు అప్పారావు, గంటా చినతల్లి, పిలకాదేవి విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం శూన్యమని అన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యా న్ని పరిరక్షించే హెల్త్ ఆఫీసరు మున్సిపాలిటీలో లేరన్నారు. కౌన్సిల్ సమావేశాలలో ప్రజారోగ్యం దుస్థితిని ప్రస్తావించినా మున్సిపల్ చైర్మన్‌కు కనీసం చీమకుట్టినట్లైనా లేదని ఆరోపించారు. పట్టణ రోడ్లపైనే ము రుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడులేడన్నారు. కోట్ల రూపాయల నిధులు పురపాలక సంఘంలో పుష్కలంగా ఉన్నా పట్టణ ప్రజలు అభివృద్ధి, వౌ లిక సదుపాయాలకు నోచుకోలేని పరిస్థితిలో ఉండడానికి కారణం చేతకాని పాలకవర్గమేనని ధ్వజమెత్తారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై ఉన్న శ్రద్ధ పాలనపై చూపితే పురపాలక సంఘం బాగుపడేదన్నారు.
ఈ రెండేళ్లల్లో ఏ సాధించారో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పదవులు ఉన్నవి బోర్డుమీద తగిలించుకోవడానికి కాదని చురకులు అంటించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ చంద్రవౌళి, పిలకాశ్రీను పాల్గొన్నారు.

మున్సిపల్ అభివృద్ధికి ఐక్యంగా పనిచేస్తాం

బొబ్బిలి రూరల్, జూలై 5: మున్సిపల్ అభివృద్ధికి అంతమంది కలిసి పనిచేస్తారని చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. రెండేళ్లు పూర్తికావచ్చిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న 30 వార్డుల్లో అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. అందుకు వార్డు సభ్యులు, ప్రజలు, అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. ఎక్కడైనా ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే తెలియజేస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్.రమేష్‌నాయుడు మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమం లో కమిషర్ శంకరరావు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.