విజయనగరం

రెండేళ్ల సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 5: జిల్లాపరిషత్ ప్రస్తుత పాలకవర్గం ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం జిల్లాపరిషత్‌లో సంబరం నిర్వహించారు. మంగళవారం జిల్లాపరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే ప్రస్తుత పాలకవర్గం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతిరాణి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు జగదీష్, శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, చిరంజీవులు, కెఎ నాయుడు, సుజయకృష్ణ రంగారావు, జెడ్పీ సిఇఓ రాజకుమారి, జెడ్పీటిసిలకు కేక్ పంచిపెట్టారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులు జెడ్పీ చైర్‌పర్సన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో రెండేళ్లలో జిల్లాలోని ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశామని, వచ్చే మూడేళ్ల కాలపరిమితిలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా అమలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.

ఆరు నెలల్లో 30 పడకల ఆసుపత్రుల నిర్మాణం పూర్తి

గజపతినగరం, జూలై 5: జిల్లాలో మూడు ప్రాంతాలలో ఆరు నెలల్లో 30పడకల ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తిచేస్తామని మెడికల్ అండ్ హెల్త్ భవన నిర్మాణాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.వి.ఎస్.ఎన్.రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని పరిశీలించడానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చినమేరంగిలో మూడు కోట్ల లక్ష రూపాయలతో 30 పడకల ఆసుపత్రి చీపురుపల్లిలో 3.60కోట్లతో, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో మూడు కోట్ల ఒక లక్షతో 30పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు నాబార్డు నుండి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కలెక్టర్ అభివృద్ధి నిధుల నుండి కోటి ఆరు లక్షల రూపాయలతో మోడల్ మార్చురీ నిర్మాణం కోసం నిధులు కేటాయించామని తెలిపారు. ఘోష ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డు నిర్మాణానికి కోటి ఐదు లక్షల రూపాయలతో టెండర్లు పిలిచామని చెప్పారు. గజపతినగరం ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు సాంకేతిక కారణాల వలన నిర్మాణ పనులకు ఆలస్యం అవుతుందని, అందుకోసమే సీమాంక్ భవనంపై గదులు నిర్మాణం చేపట్టి నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిఇ కోటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, సూపరింటెండెంట్ అరుణాదేవి పాల్గొన్నారు.

ఏడాదిలో 1200 ఉద్యోగాలు లక్ష్యం
గజపతినగరం, జూలై 5: ప్రస్తుత ఏడాదిలో 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని రెడాక్స్ లేబరేటరీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పి. దుర్గా ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఇక్కడ స్వాతి ఫంక్షన్ హాలులో మధుపాడ ఎంపిటిసి కడుపుట్ల పైడిపునాయుడు పర్యవేక్షణలో ఎండి దుర్గా ప్రసాద్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, తమ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాయని తెలిపారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు ఫార్మా రంగంలో మూడు నెలలు శిక్షణ ఇచ్చిన అనంతరం విశాఖపట్నం, హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగం ప్రారంభంలో ఆరు నెలల వరకు జీతంతోపాటు వెయ్యి రూపాయల వంతున స్ట్ఫైండ్ అందజేస్తామని చెప్పారు. 18-24 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఎస్‌ఎస్‌సి, ఇంటర్, ఐటిఐ చదివిన వారు అర్హులన్నారు. రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. టెక్నికల్ ఫేకల్టీ శివరామ ప్రసాద్ ఇంటర్వ్యూకు సహకరించారు.