విజయనగరం

ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 7: ప్రభుత్వం నిర్వహించే ప్రజాసాధికారిత సర్వేపై ప్రజలలో అభద్రతాభావం ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలలో ఏర్పడిన ఆందోళనను తొలగించవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ పల్స్ సర్వే వలన ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలకు కోత పడతాయని ప్రజలు అనుమానిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు ఏదొక విషయం తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సర్వేలో ప్రజల నుంచి కుటుంబ పరిస్థితులతోపాటు ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగత విషయాలతో కలిపి మొత్తం 80 అంశాలను ట్యాబ్, సిబ్బంది ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించాలని నిర్ణయించటంతో పేదలు, మధ్యతరగతి ప్రజల్లో ఇళ్లల్లోని టివిలు, ఫ్రిజ్‌లుంటే ఆ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోత విధిస్తారనే భయం ప్రజల్లో ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం తాజాగా చేపడుతున్న సర్వే ద్వారా సంక్షేమ పథకాలలో కోత ఉండదన్న భరోసా ప్రజలకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ విధానాల వలన రెండేళ్ల పాలనలో జిల్లాప్రజలు అధిక సంఖ్యలో వలసలు పోవటంతో సర్వేలో భాగం పంచుకునేందుకు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొందన్నారు.
ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని జయంతిని ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు బృహత్తర కార్యక్రమాన్ని ఇచ్చారని, దీనిని పార్టీలో కార్యకర్త నుండి నాయకుని వరకు అందరూ పాల్గొని నిర్వహించాలన్నారు. టిడిపి రెండేళ్ల పాలనలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అవినీతి పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితులు, టిడిపి 2014 ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలు ఎంతవరకు నెరవేర్చింది తదితర వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజల ముందు ఉంచేందుకు గడపగడపకూ వైకాపా పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. పార్టీ సమన్వయకర్తలతో కలసి వెళ్లి నేరుగా ప్రజలను కలసి ఈ పార్టీ ప్రశ్నావళిని ప్రజలకు వివరించి, ప్రజలు అందించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తెలియజేయవల్సిన బాధ్యత పార్టీనేత జగన్ అప్పగించారని, దీనిని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో నిర్వహించాలని కోరారు. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రానున్న మూడేళ్లల్లో పార్టీ కార్యాకర్తలు ప్రజల మధ్యలో ఉండి కష్టపడి పనిచేస్తే 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.