విజయనగరం

ఎస్‌బిఐ బ్రాంచ్‌ల ద్వారా రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 22: జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు భారీగా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించామని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రీజనల్‌మేనేజర్ జె.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 24వతేదీన రుణమేళా నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25వేల నుంచి 25 కోట్ల రూపాయల వరకు రుణాలను అందిస్తామని చెప్పారు. వైద్య పరికరాల కొనుగోలుకు కూడా రుణాలను మంజూరు చేస్తామని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్, కంటోనె్మంట్, ఫోర్టు, బజారు బ్రాంచ్‌లతోపాటు సాలూరు, బొబ్బిలి, కొత్తవలస, పార్వతీపురం బ్రాంచ్‌ల ద్వారా రుణాలను అందిస్తామని తెలిపారు. ఆరోజు బ్రాంచ్‌లలో రుణమేళా నిర్వహిస్తామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణమేళాలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌బిఐ చీఫ్‌మేనేజర్లు శేషుకుమార్, జి.కళ్యాణ్, మురళీకృష్ణ, కృష్ణమోహన్, నాగేంద్ర పాల్గొన్నారు.