విజయనగరం

స్థానిక సంస్థల ఖాళీలకు ఉప ఎన్నికలు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 22: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఖాళీలకు ఉప ఎన్నికలు తక్షణం నిర్వహించాలని ఎపి పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఛాంబర్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ఖాళీలు ఏర్పడిన సందర్భంలో నాలుగు నెలలు మించకుండా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గత ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఉప ఎన్నికలను నిర్ణీత వ్యవధిలోనే నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీ అయిన స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. రెండేళ్లు పూర్తయినప్పటికీ ఉపఎన్నికలు నిర్వహించని కారణంగా ఖాళీలు భర్తీ కాకపోవడంతో గ్రామ పంచాయతీలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,326 సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటిసి, వార్డు మెంబరు పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఖాళీలకు ఉప ఎన్నికలు ఏనాడో పూర్తిచేసిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఉపఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది అర్థం కావటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం స్థానిక సంస్థ ఉపఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఛాంబర్ సభ్యులు అయినాడ గ్రామ సర్పంచ్ రమేష్, నందిని, కృష్ణ, మన్మధ పాల్గొన్నారు.