విజయనగరం

చదరంగం ద్వారా విద్యార్థులలో మేథాశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 24: చదరంగం వల్ల విద్యార్థులలో మేథాశక్తి మెరుగుపడుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఆనందలక్ష్మి అన్నారు. జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి చదరంగం పోటీలను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదరంగం నేర్పించడం వల్ల ఆటలతోపాటు చదువులో కూడా రాణిస్తారని తెలిపారు. చదరంగంవల్ల విద్యార్థులలో చురుకుదనం పెరుగుతుందని, ఆత్మస్థైర్యం వికసిస్తుందని చెప్పారు. ప్రతీనెలా చదరంగం పోటీలను నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పోటీలను నిర్వహిస్తే గ్రామీణ విద్యార్ధులు, యువత చదరంగంలో మంచినైపుణ్యం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఓపెన్, అండర్-17, అండర్-19 తదితర పోటీల్లో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకా కాశీవిశే్వశ్వరుడు, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి గురుప్రసాద్, బుచ్చిబాబు పాల్గొన్నారు.