విజయనగరం

ప్రయాణికులకు మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 26: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ తెలిపారు. స్ధానిక ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీశారు. బస్‌స్టేషన్‌లలో మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడుపుతున్నామని తెలిపారు. విజయనగరం బస్‌స్టేషన్‌ను 40 లక్షల రూపాయలతో ఆధునీకరణ చేశామని చెప్పారు. అదేవిధంగా బొబ్బిలి, పార్వతీపురం బస్‌స్టేషన్‌లను కూడా ఆధునీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక రిజర్వేషన్ కౌంటర్‌లో ఆన్‌లైన్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఒపిఆర్‌ఎస్)ను పరిశీలించారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ వివరాలను అడిగి తెలుసున్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్‌తోపాటు ఎసి బస్సులలో ప్రయాణికులు ఎక్కువమంది ప్రయాణించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని డిపోమేనేజర్ కె.పద్మావతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్, కమర్షియల్ మేనేజర్ రమేష్, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిపో అసిస్టెంట్‌మేనేజర్ శర్మ పాల్గొన్నారు.