విజయనగరం

బస్‌స్టేషన్‌ల అభివృద్ధికి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 28: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డిపోలు, బస్‌స్టేషన్‌ల అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.వెంకటరాజు తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బదిలీపై వచ్చిన ఆయన గురువారం ఇక్కడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటరాజు విలేఖరులతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు డిపోలు, బస్‌స్టేషన్‌లలో వౌలిక సౌకర్యాలను కల్పిస్తామన్నారు. విజయనగరం బస్‌స్టేషన్‌లో 30 లక్షల రూపాయలతో సిసి రోడ్లను నిర్మించడంతోపాటు ఫ్లాట్‌పారాలను విస్తరించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. శ్రీకాకుళం బస్‌స్టేషన్‌లో కూడా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. అన్ని బస్‌స్టేషన్‌లలో మూత్రవిసర్జనశాలలను నిర్మించడంతోపాటు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం డివిజన్‌ల డిప్యూటీ ఇంజనీర్లు శ్రీనివాసరావు, బి.రవికుమార్, పర్సనల్ అధికారి ఎం.సన్యాసిరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి పాల్గొన్నారు.