విజయనగరం

‘వనం-మనం’కి ప్రజలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 28: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వనం-మనం విజయవంతానికి జిల్లా ప్రజలు సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని కోరారు. శుక్రవారం ప్రారంభమయ్యే కార్యక్రమంలో రాష్టవ్య్రాప్తంగా 1.30కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకున్నామని, విజయనగరం జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 13లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ధేశించారని చెప్పారు. నెలరోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 1.90కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించారన్నారు. గురువారం డిఆర్‌డిఎ సమావేశం హాలులో జిల్లా అధికారులతో సమావేశమైన మంత్రి మృణాళిని వనం-మనంతోపాటు జిల్లాలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 26శాతం పచ్చదనం ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతుండగా, విజయనగరం జిల్లాలో 18శాతం మాత్రమే ఉన్నట్లు తేలిందన్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొక్కలు నాటడంతోపాటు రెండు, మూడు నెలల వరకు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో, విద్యాసంస్థలలో, ఆసుపత్రుల ఆవరణలో, రోడ్లకు ఇరువైపులా, చెరువుగట్లపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. వనం-మనంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రధానపాత్ర పోషించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వాములు అవుతున్నాయని చెబుతూ, నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేస్తారని చెప్పారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకునేందుకు 80రూపాయల ఖర్చుతో ట్రీ-గార్డులను ఏర్పాటుకు నిర్ణయించామని అన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి, పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.