విజయనగరం

1న విద్యాసంస్ధల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 29: రాష్ట్రప్రభుత్వం విద్యారంగ సమస్యలపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆగస్టు 1వ తేదీన విద్యాసంస్ధల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపుఇస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సురేష్ తెలిపారు. శుక్రవారం కెఎల్ పురంలోని శ్రామిక భవన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలోని పలు సంక్షేమ వసతిగృహాలను ప్రభుత్వం విద్యార్థ్ధులు లేరనే సాకుతో మూసి వేసిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ప్రభుత్వం మెస్‌ఛార్జీలను పెంచడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యారంగాన్ని నీరుగార్చేవిధంగా ఉన్నాయని విమర్శించారు. ఫలితంగా పేద, సామాన్య విద్యార్థ్ధులు కనీస విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. హాస్టల్‌మూసివేతకు ప్రభుత్వం విరమించుకోవాలని, మెస్‌ఛార్జీలను వెంటనే ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు విద్యాసంస్ధల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని కోరారు. ఈసమావేశంలో డివిజన్ కార్యదర్శి రామ్మోహన్, జిల్లాకమిటీ సభ్యులు వెంకటరమణ, సాయి, భాస్కర్, గణేష్ పాల్గొన్నారు.