విజయనగరం

మున్సిపల్ స్కూళ్లలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 29: మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్‌కు ఐఐటి పౌండేషన్ కోర్సు ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. అత్యంత ఖరీదైన ఈ కోర్సును పేదవిద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ స్కూళ్లలో ప్రవేశపెట్టిందన్నారు. కస్పా మున్సిపల్ హైస్కూల్‌లో శుక్రవారం ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే ఫౌండేషన్ కోర్సుకు ప్రైవేటు విద్యా సంస్థలలో ఏడాదికి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కోర్సును జాగ్రత్తగా నేర్చుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఎంఎం నాయుడు, కస్పా, బిపిఎం మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వై.అప్పలనాయుడు, వైవి బుచ్చిరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు చెన్నా రూపవాణి, మైలపిల్లి పైడిరాజు పాల్గొన్నారు.