విజయనగరం

జగన్‌ది అరాచకత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 3: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంటే, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారం కోసం అరాచకంగా వ్యవహరిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు విమర్శించారు. అధినేత వైఖరి నచ్చకే వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యులు పార్టీని వీడుతున్నారని చెప్పారు. విజయనగరం పర్యటన సందర్భంగా ఆదివారం ఆయన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరి గి రాష్ట్రానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, విభజన సందర్భంగా ఎంపిగా ఉన్న జగన్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన ఎన్నో సమస్యలను అధిగమించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండంకెల అభివృద్ధి సాధనకు కృషి చేస్తుంటే, ప్రతిపక్ష నేత జగన్ అభివృద్ధి నిరోధకుడిగా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో పరిశ్రమల ఏర్పాటుకోసం మూడువేల ఎకరాల రైతుల భూమిని సేకరించేందుకు అప్పట్లో అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎంతో గందరగోళం జరిగిందని, కానీ, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఒప్పించి 32వేల ఎకరాల భూమిని సేకరించటం రికార్డుగా అభివర్ణిచారు. కానీ, ప్రతిపక్షనేత జగన్ రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారని, రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసారని విమర్శించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం దెబ్బతిన్న జపాన్ ఆ తరువాత ఎంత అభివృద్ధి సాధించిందో, అదే తరహాలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా వెనకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే, పోలవరం, పట్టిసీమ వృథా అంటూ ప్రకటనలు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం జరిగిందని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కెఎ నాయుడు, జడ్పీ వైస్‌చైర్మన్ కృష్ణమూర్తి, పార్టీ నాయకులు భంజ్‌దేవ్, ఐవిపి నాయుడు తదితరులు పాల్గొన్నారు.