మహబూబ్‌నగర్

వాటర్ షెడ్ సాధనకై రాష్ట్రానికి రూ.140 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, జనవరి 21: తెలంగాణ రాష్ట్రానికి వాటర్ షెడ్ పనుల కోసం రూ.140 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనిత రాంచంద్రన్ అన్నారు.
గురువారం బొంరాస్‌పేట మండలంలోని రేగడిమైలారం, తుంకిమెట్ల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అనిత రాంచంద్రన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న ఉపాధిహామీ పథకంలో పని చేసే కూలీల సంఖ్య తక్కువగా నమోదు అవుతుందని అన్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రతి రోజు 9.5 లక్షల మంది కూలీలు పని చేస్తున్నారని వీరికి కూలీ డబ్బుల కింద రోజుకు రూ.9 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కరువు పరిస్థితులు అధికంగా నెలకొన్న పాలమూరు జిల్లాలో మాత్రం రోజుకు కేవలం 2000 మంది కూలీలు మాత్రమే పని చేస్తున్నారని కూలీల సంఖ్య మరింత పెరగాలని అన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూమి గట్టిగా మారడంతో పని చేయడం కూలీలకు కొంత ఇబ్బందిగా ఉందని అన్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కూలీ పెంచే అవకాశం కూడా ఉందని రానున్న వేసవిలో పనిచేసే కూలీలకు పెరుగుతున్న కూలీకి అదనంగా వేసవి అలవెన్సులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు గ్రామాల్లో పని చేస్తున్న కూలీలను రోజుకు ఎంత కూలీ వస్తుంది, మహిళ సంఘాల్లో మీరు సభ్యులుగా ఉన్నారా, తాగునీటి ఇబ్బందులు నెలకొన్నాయా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని పలు ప్రశ్నలను అడిగారు. ఈ కార్యక్రమంలో పిడి దామోదర్‌రెడ్డి, జడ్పి సిఇఓ లక్ష్మీ నారాయణ, వాటర్‌షెడ్ జాయింట్ కమీషనర్ జాన్‌వెస్లి, డిపిఓ వెంకటేశ్వర్లు, ఏపిలు సరళ, ఎంపిడిఓ పద్మజలు ఉన్నారు.