క్రైమ్/లీగల్

పథకం ప్రకారమే గౌతమీ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, జూన్ 26: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం రోడ్డులో దిగమర్రు వద్ద 2017, జనవరి 18న టాటా సపారీ మోటారు సైకిల్‌పై వెడుతున్న శ్రీ గౌతమి, ఆమె సోదరి పావనిని డీకొట్టడంతో శ్రీ గౌతమి మృతి చెందింది. పావని ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉంది. ఈ మృతిని అప్పుడు పోలీసులు ప్రమాదంగానే ప్రకటించారు. కాని ఇది పథకం ప్రకారమే జరిగిందని మహిళా సంఘాలు, పావని చేసిన వత్తిడితో పరిశోధన చేయగా పథకం ప్రకారమే హత్య జరిగిందని పోలీసులు తేల్చి చెప్పారు. కేవలం ప్రమాదంగా భావించి టాటా సఫారితో ఢీకొట్టిన విశాఖకు చెందిన సందీప్, దుర్గాప్రసాద్‌ను అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి ప్రమాద కేసుగా దర్యాప్తు చేశారు. తరువాత శ్రీగౌతమి సెల్‌ఫోను చూసిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాలకొల్లు రూరల్ సీఐ కె రజనీకుమార్ మంగళవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ సజ్జా వీర వెంకట సత్యనారాయణ (బుజ్జి) శ్రీగౌతమిని భార్య ఉండగానే రహస్య వివాహం చేసుకున్నాడు. శ్రీగౌతమిని తన ఆర్థిక సాయంతోనే చదివించాడు. కానీ ఇంట్లోను, ఇతరులకు ఈ విషయం తెలియటంతో శ్రీగౌతమిని అడ్డు తొలగించుకోవాలని ఆయన స్నేహితులు బాలప్రతాప్ (జడ్పీటీసీ), బాలం ఆండ్రు, బొల్లపల్లి రాంప్రసాద్ (రమేష్)కు పురమాయించారు. వీరందరూ విశాఖకు చెందిన సందీప్, దుర్గాప్రాస్‌ద్‌ను సంక్రాంతి సందర్భంగా రప్పించారు. కోడి పందాలతో హడావిడిగా ఉండే సమయంలో శ్రీగౌతమి, పావని వైద్యం కోసం పాలకొల్లు వచ్చారని తెలిసి వారికోసం రిలయన్స్ బంకు వద్ద కాపు కాశారు. వీరు ఈ బంకు మీదుగా నర్సాపురం వెడుతున్న సమయంలో వెంట వెళ్లి దిగమర్రు దగ్గరలో ఢీకొట్టించారని, ఈ కేసును పథకం ప్రకారం హత్యచేసిన ఘటనగా కేసు మార్పుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులుగా సజ్జా బుజ్జిని, బొల్లంపల్లి రమేష్, నర్సాపురం జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని బంధువు బాలం ఆండ్రును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి పాలకొల్లు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సందీప్, దుర్గాప్రసాద్, కౌరు లక్ష్మణ్ (డ్రైవరు)ను తిరిగి అరెస్టు చేస్తామని చెప్పారు. సెల్‌ఫోనులో రికార్డు అయిన సంభాషణ ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. సమావేశంలో రూరల్ ఎస్సై ఆదిప్రసాద్ పాల్గొన్నారు.