క్రైమ్/లీగల్

ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వివరాలు వెల్లడించిన సీపీ రవీందర్
వరంగల్ క్రైం, సెప్టెంబర్ 22: డమీ పిస్టోల్‌తో వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన సూడో నక్సలైట్లను శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు. వారినుండి డమీ పిస్తోల్‌తోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నకిలీ నక్సలైట్లకు సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ గ్రామానికి చెందిన వనపాకుల రాంబాబు ఆలియాస్ ఆజాద్, ఆలియాస్ ఈశ్వర్ (45), ఇల్లందు గ్రామానికి చెందిన కాంపాటి ఆశాలు(30) నక్సలైట్ల పేరుతో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందితుల్లో వనపాకుల రాంబాబు పదవతరగతి వరకు చదువుకుని, సోడాలు, ఐస్‌క్రీం బండ్లను నడుపుకోవడంతోపాటు కొన్ని సంవత్సరాలు ఆటో డ్రైవర్‌గా పనిచేసాడు. 2000సంవత్సరంలో ఒక వామపక్ష పార్టీలో చేరి పనిచేస్తు న్న క్రమంలో మద్యంతోపాటు ఇతర జల్సాలకు అలవాటు పడ్డాడు. వచ్చే ఆదాయం సరిపోక సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ప్రజాప్రతిఘటన నక్సలైట్ల పేరుతో వ్యాపారస్థులు, కాంట్రాక్టర్లనుండి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో హైదరాబాద్‌లో డమీ పిస్తోల్ కోనుగోలు చేసాడు. 2009నుండి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లో బెదిరించి డబ్బు వసూళ్లు చేయడం, దోపిడీలు, కిడ్నాప్, హత్యలు మొత్తం 18నేరాలకు పాల్పడ్డాడు. 2018మార్చి నెలలో జైలునుండి బయటకు వచ్చిన తదుపరి కొద్దిరోజులు స్వగ్రామంలో ఆటో నడిపిన నిందితుడు రాంబాబు తన బంధువు అయిన కంపాటి ఆశాలుతో కలిసి మరో డమీ పిస్తోలును కోనుగోలు చేసాడు. ఈనెల 21న డమీ పిస్తోల్‌తో నర్సంపేట ప్రాంతానికి చెందిన మిర్చి వ్యాపారి వీరన్నకు ఫోన్‌చేసి, తాము ప్రజాప్రతిఘటన నక్సలైట్లమని, 10లక్షలు పార్టీ చందా ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా డబ్బులు తీసుకుని వరంగల్ ఆజంజాహిమిల్ ప్రాంతానికి రావాలని బెదిరించడంతో భయంతో మిర్చి వ్యాపారి మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అప్రమతమైన సిసిఎస్ పోలీసులు క్రైం డిసిపి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌రాజ్, మిల్స్‌కాలనీ పోలీస్ సిబ్బందితో కలిసి ఉదయం 7గంటలకు వెంకట్రామ టాకీస్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. వరంగల్ రైల్వేస్టేషన్‌నుండి ఆజంజాహిమిల్లు ప్రాంతానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు నిందితులను అనుమానంతో పోలీసులు ఆపి తనిఖీ చేయడంతో డమీ పిస్టోల్ లభ్యం కావడంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు పాల్పడిన నేరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను సకాలంలో గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ అభినందించారు.