రాష్ట్రీయం

నూతన సంవత్సర కానుక - తెల్లకార్డు లేకున్నా ఉచిత వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రోగులకు సీఎంసీఓ రెఫరల్ కార్డులు
* ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లింపులు
విజయవాడ, డిసెంబర్ 31: రాష్ట్రంలో అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ప్రకటించింది. తెల్లకార్డు లేకున్నా రోగులకు ప్రభుత్వం సూచించిన స్పెషాలిటీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ‘డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్యసేవ’ కింద ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న సిఎంసిఓ రెఫరల్ కార్డులు తీసుకోవాలి. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు వున్నవారికి ఈ రెఫరల్ కార్డులు అవసరం లేదు. గులాబీ రేషన్ కార్డులు, ఎలాంటి రేషన్ కార్డులు లేని వారికి మాత్రం సిఎంసిఓ రెఫరల్ కార్డులు తప్పనిసరి. ప్రతి రెఫరల్ కార్డుకు ప్రత్యేకంగా ఒక నెంబర్‌ని కేటాయిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా ప్రభుత్వం సూచించిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందుతాయి. ఈ ఆస్పత్రులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెవెన్యూ విభాగం ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఆమోదిత ప్యాకేజీల కింద ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అనుమతి తీసుకుని ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఆస్పత్రులు చికిత్స అందించాలి. రోగుల దగ్గర డబ్బు తీసుకున్నట్టు ట్రస్ట్ దృష్టికి వస్తే ఆయా ఆస్పత్రులకు ముందస్తు అనుమతి, క్లయిమ్ రద్దవుతుంది. రెఫరల్ కార్డులను హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లోని సిఎం క్యాంప్ కార్యాలయం దగ్గర వున్న ట్రస్ట్ క్లినిక్, ఇంకా విజయవాడ జిజిహెచ్, విశాఖపట్నం కెజిహెచ్, తిరుపతి స్విమ్స్, కర్నూలు జిజిహెచ్, కాకినాడ జిజిహెచ్‌లలో జారీ చేస్తారు. రోగి స్వయంగా ఈ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు వేసి కార్డులు పొందాలి. రెఫరల్ కార్డులతో చికిత్స పొందాలనుకునేవారు పైన పేర్కొన్న నమోదు కేంద్రాలకు సంబంధిత వైద్య పత్రాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డుల ఒరిజినల్స్‌ను రోగులు తమ వెంట తీసుకువెళ్లాలి. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు చికిత్స అందించాల్సి వుంటే ఆ చిన్నారి జనన ధ్రువీకరణ పత్రంతో సహా తల్లిదండ్రుల గుర్తింపు కార్డును జతచేయాలి. సిఎంసిఓ కార్డులు జారీచేసిన పది రోజుల వరకే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయంలోగా రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సి వుంటుంది. రెఫరల్ కార్డుల గురించి ఏమైనా సందేహాలు, మరింత సమాచారం కావాలనుకునేవారు 104 హెల్ఫ్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.