రాష్ట్రీయం

90లక్షల మందికి కొత్తగా.. తెల్ల రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటల వెల్లడి
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత పథకం కింద అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తెల్ల రేషన్ కార్డు నిమిత్తం 1,01,37,897 దరఖాస్తులను వచ్చాయని, ఇందులో 90,15,729 మంది అర్హులని గుర్తించినట్లు చెప్పారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్ర విభజన కంటే ముందు 2.24 కోట్ల మందికి 80.09 లక్షల రేషన్ కార్డులు ఉండేవన్నారు. ఇప్పుడు 2.81 కోట్ల మందికి 89.47 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. తెల్లరేషన్ కార్డుకు గ్రామాల్లో పరిమితిని రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో పరిమితిని రూ.2 లక్షలకు పెంచామన్నారు. ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి హాస్టల్ విద్యార్ధులకు సన్నబియ్యం అన్నం వండి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం సాలీనా సబ్సిడీ బియ్యానికి రూ.7200 కోట్లను ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు.