నమ్మండి! ఇది నిజం!!

స్ర్తిలకు మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్ దేశస్థులకి పని వత్తిడి అధికం. వారి సంస్కృతి ఏ పనైనా విడవకుండా సమర్థవంతంగా, లోపరహితంగా చేయడం. సగటు జపనీస్ ఉద్యోగి పని గంటలకన్నా ఎక్కువ కాలం ఆఫీస్‌లో గడుపుతాడు. దాంతో వారిలో మానసిక వత్తిడి అధికంగా ఉంటుంది. దీన్ని అణచడానికి జపాన్‌లో అనేక చిత్రమైన సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని కేవలం ఆడవారికే పరిమితం.
జపాన్‌లోని కొన్ని హోటల్స్‌లో ఉద్యోగంలో తమకి ఏర్పడ్డ మానసిక వత్తిడిని, సమస్యలని తగ్గించుకోవడానికి క్రైయింగ్ రూమ్స్ (ఏడ్చే గదులు) అద్దెకి ఇస్తున్నారు. ఈ గదులు ఏడవడానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. కన్నీళ్లు తుడుచుకోడానికి ఖరీదైన పేపర్ టిష్యూలని అక్కడ ఉంచుతారు. ఏడ్చాక వాటితో మృదువుగా కళ్లు, మొహం తుడుచుకోవచ్చు. ఏడ్చిన తర్వాత కళ్లు ఉబ్బినట్లు కనపడకుండా స్టీమ్ ఐ మాస్క్ కూడా ఆ గదిలో అందుబాటులో ఉంటుంది. ఏడుపు రావడానికి అనుగుణంగా ట్రాజెడీ సినిమాలు, సెంటిమెంట్ పుస్తకాలు కూడా ఉంటాయి. ఈ గదుల అద్దె ఓ రాత్రికి పది వేల ఎన్స్. దురదృష్టవశాత్తూ ఆడవాళ్లకి మాత్రమే ఈ గదులు పరిమితం. కాబట్టి మగవాళ్లు ఏ రోడ్డు మీదనో ఏడవాల్సి ఉంటుంది.
మరో చిత్రమైన సేవ కూడా జపనీస్ ఆడవారికి మాత్రమే అందుబాటులో ఉంది. పెళ్లి కాకుండా వంటరిగా జీవించే యువతులు తమ ఒంటరితనాన్ని పారద్రోలటానికి ఓ రాత్రికి ఓ బాయ్‌ఫ్రెండ్‌ని అద్దెకి తీసుకోవచ్చు. సాయ్‌నే - యా - ప్రైమ్ అనే సంస్థ బాయ్‌ఫ్రెండ్స్‌ని అద్దెకి పంపుతుంది. ఐతే ఆ అందమైన యువకుడితో హోటల్‌కి డిన్నర్‌కి, సినిమాకి, నాటకాలకి వెళ్లచ్చు. కాని ఎట్టి పరిస్థితుల్లో వారితో సెక్స్‌లో పాల్గొనకూడదు.
షిమ్‌షిమా అనే టీవీ సీరియల్‌లో భర్తకి విడాకులిచ్చి వంటరిగా జీవించే భార్యకి నిద్ర పట్టక, అందుకోసం ఓ మగవాడి పక్కన పడుకుంటుంది. దీన్ని చూసిన ‘సాయ్‌నే యా ప్రైమ్’ అధినేతకి ఇన్‌స్పిరేషన్ వచ్చి ఇంకో రెండు వ్యాపారాలని ఆరంభించాడు. ఒకటి కడుల్ కెఫే. గంటకి నలభై డాలర్లు అద్దె చెల్లించి ఈ కెఫేకి వెళ్లి ఓ మగాడు ఓ యువతిని కేవలం కౌగిలించుకోవచ్చు. ఐతే అది సెక్స్ రహితంగా ఉండాలి. అంటే చుంబనాలు, సెక్స్ నిషిద్ధం. మరొకటి రాత్రుళ్లు వొంటరితనం పారద్రోలడానికి పక్కన పడుకునేందుకు అందమైన యువకులని అద్దెకి ఇవ్వడం. ఇందుకు ఏడు గంటలకి 30 వేల ఎన్స్. ఎనిమిది గంటలకి 33 వేలు, 9 గంటలకి 36 వేలు, 10 గంటలకి 40 వేలు, 11 గంటలకి 44 వేలు, పనె్నండు గంటలకి 48 వేలు చెల్లించాలి. ఈ ఇన్‌స్పిరేషన్‌తో 2011లో న్యూయార్క్‌లోని రోచెస్టర్ ఏరియాలో దీని బ్రాంచ్‌ని తెరిచారు.
ఇటీవలే జపాన్‌లో ఉద్యోగినుల కోసం మరో కొత్త వ్యాపార సేవ ఆరంభమైంది 7,900 ఎన్స్ చెల్లించి ఐక్ మీసోని (అందమైన యువకుడు) అద్దెకి తీసుకోవచ్చు. ఏడుగురు ఐక్ మీసోలలో ఒకర్ని ఎంపిక చేసుకోవచ్చు. అతను సరాసరి ఆఫీస్‌కి వచ్చి తన మెత్తటి చేతి రుమాలుతో ఆ ఉద్యోగిని కన్నీళ్లు తుడుస్తూ సానుభూతి మాటలని చెప్తాడు. ఆఫీస్‌లోని వత్తిడి వల్ల దుఃఖించే ఉద్యోగినులకు ఇది సాంత్వనని కలిగిస్తుంది. 24 సెప్టెంబర్ 2015లో ఆరంభమైన ఈ సేవా విభాగంలో ఏడు రకాల యువకులు అందుబాటులో ఉంటారు. చిన్న తమ్ముడు, మేధావి, పెద్దవాడు.. ఇలా ప్రస్తుతం టోక్యోలో మాత్రమే నడిచే దీన్ని హిరోకి టెరాయ్ అనే అతను ప్రారంభించాడు. ఈ సంస్థ ఆరంభించినప్పటి నించి ఏడుగురు మగవాళ్లు చాలా బిజీగా ఉన్నారుట! బాధ్యతగల ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో పనిచేసే స్ర్తిలు, వర్క్ హాలిక్స్ వీళ్లని అధికంగా ఉపయోగించుకుంటున్నారు.
జపాన్‌లోని మరో సామాజిక సమస్య, మహిళలు పెళ్లి, కెరీర్‌లలో పెళ్లిని వదిలేసి కెరీర్‌ని ఎన్నుకోవడం. ఈ రకం వంటరి మహిళల కోసం ‘సోలో వెడ్డింగ్’ అనే సేవని క్యోటోలోని సెర్కా ట్రావెల్స్ ఆరంభించింది. ఆ మహిళ ఓ రోజు పెళ్లయిన అనుభవాన్ని అనుభవించచ్చు. పెళ్లికూతురికి చేసే అలంకారాలు, వేడుకలన్నీ జరుపుతారు. ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్ కుట్టించి నిపుణులు హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ చేస్తారు. ఆ రోజు ఖరీదైన హోటల్‌లో ఉంచుతారు. క్యోటోలోని వివిధ లొకేషన్స్‌కి తీసుకెళ్లి ఫొటో షూట్‌ని కూడా చేస్తారు. 20 నించి 70లోపు వయసుగల మగవాళ్లని వాళ్ల పెల్లికొడుకుగా ఎంపిక చేసుకోవచ్చు. దీనికి అనేక పేకేజెస్ ఉన్నాయి. అతి చవకైనది 3 లక్షల 30 వేల ఎన్స్. విడాకులు తీసుకున్న ఏభై ఏళ్ల మహిళ ఈ సేవని మొదటగా ఉపయోగించుకుంది. ఆరంభం రోజే పది మంది స్ర్తిలు ఈ సేవని ఉపయోగించుకున్నారు. వారి సగటు వయసు 30. ఒకరిద్దరు తమ బాయ్‌ఫ్రెండ్స్‌నే పెళ్లికొడుకుగా తెచ్చుకున్నారు. పెళ్లి అనే అందమైన కలని ఈ విధంగా వారు తీర్చుకున్నారు. ఈ సర్వీస్ మొదలై ఏడాది దాటుతోంది.
జపాన్‌లో స్ర్తిల కోసం ఓ సేవా వ్యాపారం గత నలభై ఏళ్ల నించి నడుస్తోంది. అది ఆపరేషన్ ద్వారా కృత్రిమ కనె్నపొరని అమర్చడం. అనేక కారణాలుగా కనె్నపొర ఛేదింపబడ్డాక పెళ్లయినపుడు భర్తకి తన మీద అనుమానం రావచ్చనే భయంతో ఈ కృత్రిమ కనె్న పొరని యువతులు పెళ్లికి ముందు సర్జికల్‌గా ఏర్పాటు చేసుకుంటారు. తొలి రాత్రి తన భర్తకి తాము కన్య అని నమ్మకాన్ని కలిగించేది కనె్నపొరని మించి ఏముంటుంది? ఇది ఇప్పుడు చైనాలో కూడా పాపులర్ అయింది. ఈ రకం సర్జరీలో శిక్షణ కోసం జపాన్‌కి ప్రపంచంలోని సంపన్న దేశాల నించి సర్జన్స్ వచ్చి వెళ్తున్నారు.
ఇలా జపాన్‌లోని మహిళల భౌతిక, మానసిక అవసరాలని గుర్తించి వివిధ సేవలని వ్యాపారస్థులు అందించడం విశేషం.

పద్మజ