ఆంధ్రప్రదేశ్‌

యాదాద్రి వరకూ ఎంఎంటిఎస్ పొడిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 22: దేశంలోనే నల్లగొండ జిల్లా యాదాద్రి దేవస్థానాన్ని దర్శనీయ దివ్య క్షేత్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో పెరుగనున్న భక్తుల సౌకర్యార్ధం ఎంఎంటిఎస్ రైల్ సర్వీస్ రెండో దశను ఘట్‌కేసర్ నుండి రాయగిరి(యాదాద్రి) రైల్వే స్టేషన్ వరకు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశారు. హైద్రాబాద్ చుట్టూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే సికింద్రాబాద్-ఘట్‌కేసర్ మధ్య ఎంఎంటిఎస్ రెండో దశను 21కిలోమీటర్లు పొడిగిస్తున్నందున ఇక్కడి నుండి రాయగిరి స్టేషన్ వరకు మరో 32కిలోమీటర్లు పొడిగించాలని ఆయన సిఎం కెసిఆర్ లేఖలో కోరారు. లేఖతో పాటు రాయగిరి వరకు రెండో దశ పొడిగింపు ప్లాన్‌ను జతపరిచారు. ఘట్‌కేసర్ నుండి రాయగిరి వరకు ఎంఎంటిఎస్ రెండో దశ పొడిగింపునకు 330కోట్లు అవసరమున్నందున 2016-17బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం 2/3వంతు, ఇండియన్ రైల్వే 1/3వంతు నిధుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కెసిఆర్ కోరారు. ప్రభుత్వం యాదాద్రి దేవస్థానాన్ని తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు వైటిడిఏ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించి 2వేల ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా ఆ లేఖలో తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20 వేల మంది, సెలవు దినాల్లో 50వేల మంది యాదాద్రిని సందర్శిస్తున్నారని, భవిష్యత్‌లో యాదాద్రి దివ్యక్షేత్ర నిర్మాణం పిదప రోజుకు లక్ష మంది భక్తులు సందర్శించవచ్చని తెలిపారు. సికింద్రాబాద్-ఖాజిపేట రైల్వే జంక్షన్ మార్గం అభివృద్ధి నేపధ్యంలో రాయగిరి స్టేషన్ వరకు ఘట్‌కేసర్ నుండి మూడో లైన్ నిర్మాణంతో ఎంఎంటిఎస్ రెండో దశను పొడిగించాలని సిఎం కోరారు.