ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ కట్టడాలు, రహదారులకు మార్కెట్ ధర కంటే తక్కువకు సిమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల వెల్లడి

విజయవాడ, డిసెంబర్ 28: రాష్ట్రంలో గృహ నిర్మాణంతో పాటు నీటిపారుదల, రహదారులు, భవనాలు, పంచాయతిరాజ్ నిర్మాణ పనులకు అవసరమైన 9.1 మిలియన్ టన్నుల సిమెంట్‌ను మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గతంలో జరిగిన చర్చల్లో గృహ నిర్మాణ రంగానికి సిమెంట్ బస్తా పిపిసి రకం రూ.240, ఓపిసి రకం రూ.250కు ఇచ్చేందుకు అంగీకరించిన సిమెంట్ కంపెనీలు సోమవారం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చల్లో అదే రేటుకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. ఈసందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పన్నుల పెరుగుదల, విద్యుత్, డీజిల్, మైనింగ్‌లలో ధరల పెరుగుదల సందర్భంలో కంపెనీలు చేసిన విజ్ఞప్తులను మంత్రివర్గ ఉప సంఘం చర్చించిందని చెప్పారు. అన్నింటినీ దృష్టిలో వుంచుకుని రేటు నిర్థారించి కేబినెట్‌కు సిఫార్స్ చేస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో గృహ నిర్మాణానికి 3.5, ఇరిగేషన్‌కు 3.5, ఆర్ అండ్ బికి 0.3, పంచాయతిరాజ్‌కు 1.8 మిలియన్ టన్నుల సిమెంట్ అవసరమవుతుందని తెలిపారు. పరిశ్రమలకు అనేక రాయితీలు ఇస్తున్నామని, ప్రధానంగా సబ్సిడీపై విద్యుత్‌ను కూడా సరఫరా చేస్తున్నందున సిమెంట్ కంపెనీలు తమవంతుగా ప్రభుత్వ కార్యక్రమాలకు తక్కువ ధరకు సిమెంట్ అందించాల్సి వుందన్నారు. రెండో మంత్రివర్గ ఉపసంఘం చక్కెర పరిశ్రమ, ఫెర్రో ఎల్లాయిస్, టెక్స్‌టైల్ పరిశ్రమలు, జూట్‌మిల్లుల పునరుద్ధరణపై చర్చించింది. చక్కెర పరిశ్రమపై వ్యాట్, సిఎస్‌టిలను తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వం రూ.70కోట్ల ఆదాయం కోల్పోతోంది. అయినప్పటికీ రైతుల బకాయిలు చెల్లించటంలో కంపెనీలు జాప్యం చేస్తుండటంపై సమావేశంలో మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితమైన ఫెర్రో ఎల్లాయిస్, టెక్స్‌టైల్, జూట్‌మిల్లులు నష్టాల్లో కొనసాగుతుండటాన్ని సమీక్షించారు. ఈ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది ఉద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని వీటి పునరుద్ధరణకు అవసరమైన రాయితీలు అందించేందుకు సిఫార్స్ చేయాలని ఉపసంఘం నిర్ణయించింది. సెంట్రల్ ఎక్సైజ్‌లో రాయితీ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, హౌసింగ్ కార్యదర్శి లవ్ అగర్వాల్ పాల్గొన్నారు.