ఆంధ్రప్రదేశ్‌

సేద్యానికి దన్ను, సంక్షేమానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలిసారిగా ఈ-బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపి ఆర్థికమంత్రి యనమల

హైదరాబాద్, మార్చి 10 : వ్యవసాయం, అనుబంధ రంగాలతోపాటు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ 2016-17 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభకు సమర్పించారు. తన బడ్జెట్‌ను ‘ఇ-బడ్జెట్’ గా యనమల చెప్పుకున్నారు. బడ్జెట్ ప్రసంగం పుస్తకాల బదులు బడ్జెట్ ప్రసంగం, అంకెల వివరాలు కలిగిన ‘పామ్‌ట్యాప్’ను సభ్యులకు అందచేశారు. రైతుల రుణమాఫీకి సంబంధించి రుణవిమోచన పథకానికి కేటాయింపులను గత ఏడాదితో పోలిస్తే తగ్గించారు. గ్రామీణాభివృద్ధికి సైతం నిధులు తగ్గించారు. ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసిలు, ఇతర వర్గాల సంక్షేమానికి నిధులు భారీగా పెంచారు. 2016-17 సంవత్సరంలో ప్రాథమిక రంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కరవురహిత రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దాలన్న లక్ష్యం ముందుంచుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక రంగానికి 16,491కోట్ల రూపాయలు కేటాయించారు. గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ప్రారంభమైన యనమల బడ్జెట్ ప్రసంగం సరిగ్గా 2 గంటల 7 నిమిషాలపాటు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు....యనమల ప్రసంగ పాఠాన్ని తన ‘పామ్-ట్యాప్’లో చూస్తూ కూర్చున్నారు. 2015 వరకు జాతీయ స్థాయి వృద్ధిరేటు 7.3 శాతం నమోదు కాగా, ఎపిలో వృద్ధిరేటు 10.9 శాతంగా నమోదైందని చెప్పారు. భవిష్యత్తులోకూడా ఇంతేవేగంగా కొనసాగుతూ, 15 శాతం వృద్ధి సాధించేందుకు ఈ బడ్జెట్ తోడ్పడుతుందని వివరించారు. బడ్జెట్ వివరాలను యనమల వివరిస్తూ 2016-17 సంవత్సరానికి 1,35,688.99 కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్‌ను రూపొందించామని వివరించారు. ఇందులో ప్రణాళికా వ్యయాన్ని 49,134.44 కోట్లుగా ప్రతిపాదించారు. గత ఏడాది కంటే ఇది 42.78 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ప్రణాళికేతర వ్యయాన్ని 86,554.55 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతవరకు తగ్గించాలని ప్రయత్నించినప్పటికీ, పెరిగిన ధరలు, వేతనాల పెరుగుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కంటే ఇది 10 శాతం ఎక్కువని వివరించారు. 2016-17 సంవత్సరంలో రెవెన్యూ లోటు 4,868.26 కోట్ల రూపాయలు ఉండగలదని, ద్రవ్యలోటు 20,497.15 కోట్లుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.99 శాతంగానూ, రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.71 శాతంగా ఉంటుందని వివరించారు.
ప్రాథమిక రంగానికి పెద్దపీట
బడ్జెట్‌లో ప్రాథమిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 63 శాతం ప్రజలు ఆధారపడ్డ ప్రాథమిక రంగం పటిష్టంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు. వ్యవసాయం, పళ్లతోటలు, పట్టుపరిశ్రమ, రుణమాఫీ, మత్స్యపరిశ్రమ, పాడి, పశుగణాభివృద్ధి, పర్యావరణం, అడవులు తదితర అంశాలను కలుపుతూ ప్రాథమిక రంగం కోసం 16,491.81 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
జలవనరులు
80 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలిచేందుకు. తద్వారా 8.8.30 లక్షలను ఖరీఫ్‌లో సాగులోకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని యనమల తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 7 సాగునీటి పథకాలను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2018 వరకు పూర్తిచేస్తామని, భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు నీరు-చెట్టుపథకాన్ని చేపట్టామన్నారు. నీటిపారుదల రంగానికి 7325.21 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 2015-16 కంటే ఇది 57 శాతం ఎక్కువన్నారు. చిన్న నీటిపారుదల రంగానికి 674 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు.
పారిశ్రామిక రంగం
పారిశ్రామికరంగానికి 975.77 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా 2015-20 కాలానికి పారిశ్రామిక అభివృద్ధి విధానం ప్రకటించామన్నారు. ఒక పరిశ్రమకు అనుమతి ఇచ్చేందుకు 2014-15 లో 90 రోజుల సమయం పట్టేదని, 2015-16 కు దీన్ని 21 రోజులకు తగ్గించామని, 2016-17 లో 14 రోజులకు కుదించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 100 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. చేనేత, జౌళి రంగాల అభివృద్ధికోసం 125.84 కోట్ల రూపాయలు కేటాయించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా ఇది 172 శాతం ఎక్కువని తెలిపారు.
వౌలిక సదుపాయాలు
పారిశ్రామిక రంగంలో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2016-17 లో మచిలీపట్నం, భావనపాడు నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామని, నాలుగు ఇన్‌లాండ్ వాటర్‌వేస్‌ను చేపడుతున్నామన్నారు. విజయవాడ-రాజమహేంద్రవరం విమానాశ్రయాల విస్తరణ జరుగుతోందని, భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్, దొనకొండలలో ఐదు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. వౌలిక సదుపాయాలు, రహదారుల కోసం 3,184.25 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రహదారి భద్రత కోసం 150.78 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు.
ఇంధన రంగం
వచ్చే మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు సామర్థ్యంతో విద్యుదుత్పత్తి కేంద్రాలు వస్తున్నాయని, అనంతపురం, కర్నూలు పట్టణాల్లో 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ పార్కులను ప్రారంభించామని, 2016-17 లో మరో 619 మెగావాట్లు జతచేస్తామన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పట్టణ గ్యాస్ పంపిణీ వ్యవస్థ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఇంధన శాఖకు 4020.31 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
ఫైబర్ గ్రిడ్
320 కోట్లతో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామని యనమల తెలిపారు. గృహనిర్మాణ రంగానికి 1,132.83 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
సేవారంగం
ఎపి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సేవా రంగాల వాటా 46.6 శాతంగా ఉందని, ఈ రంగంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2016-17 లో సేవారంగంలో పెరుగుదల 15 నుండి 16 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నారు. సేవారంగాలు, ఐటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) రంగాలకు 360.22 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
ఆరోగ్యం
విశాఖపట్నం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్, తిరుపతిలో శ్రీపద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రారంభిస్తామన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి 6,103 కోట్లు ప్రతిపాదించామన్నారు.
ప్రజాపంపిణీ, పౌష్టికాహారం
ప్రజాపంపిణీ వ్యవస్థకోసం2,702 కోట్ల రూపాయలు కేటాయించారు. గర్భిణిలకు, పిల్లకు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టిన పథకాల అమలు కోసం 750 కోట్లు కేటాయించారు.
సంక్షేమం
సాంఘిక సంక్షేమానికి 6,342 కోట్లు, గిరిజన సంక్షేమానికి 3,100 కోట్లు, బిసి సంక్షేమానికి 8,832 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 250 కోట్లు, ఇతర కులాల అభివృద్ధికి 1065 కోట్లు కేటాయించారు. వృద్ధులు, వితంతువులు, తదితరుల పింఛన్లకోసం 2,998 కోట్ల రూపాయలు కేటాయించామని యనమల తెలిపారు.
యువత
యువత సాధికారత కోసం 252.38 కోట్లు ప్రతిపాదిస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికోసం 376.39 కోట్లు, క్రీడలకోసం 215.38 కోట్ల రూపాయలు కేటాయించారు.
గ్రామీణ, పట్టణాభివృద్ధి
పంచాయితీరాజ్ సంస్థలకు 4,467.65 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి తెలిపారు. గ్రామీణ మంచినీటి సరఫరాకు 1,195.63 కోట్లు కేటాయించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 4,764.71 కోట్లు కేటాయించారు.పట్టణ పాలక సంస్థలకు 4,728.95 కోట్లు ప్రతిపాదించారు. పారిశుద్ధ్య పనులకోసం 110 కోట్లు కేటాయించారు.
అమరావతికి 1500 కోట్లు
రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి యనమల తెలిపారు.
శాంతి భద్రతలు
శాంతి, భద్రతలకోసం 4,785.41 కోట్ల రూపాయలు కేటాయించారు. రెవెన్యూ శాఖకు 3,119.72 కోట్లు కేటాయించారు.

స్థూలంగా ఇదీ బడ్జెట్!

రెవిన్యూ ఆదాయం 1,09,300కోట్లు
అందులో
కేంద్రం నుండి పన్నుల రూపం 24,637 కోట్లు
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 26,849 కోట్లు
రాష్ట్ర సొంత వనరులు 52,318 కోట్లు
సొంత వనరుల్లో..
అమ్మకపు పన్ను ద్వారా 37,435 కోట్లు
ఎక్సైజ్ ద్వారా 5,756 కోట్లు
ఎంవి టాక్స్ 2,412 కోట్లు
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 5,180కోట్లు
ఇతర వనరులు 5,495 కోట్లు
ఇతర వనరుల్లో గనులశాఖ 1,705కోట్లు
ఇతర వనరుల్లో అడవులు 922 కోట్లు

రెవిన్యూ లోటు 4,868 కోట్లు
ద్రవ్య లోటు 20,497కోట్లు
-------------------------------------------
జిఎస్‌డిపి 6,83,382 కోట్లు
ప్రణాళికేతర వ్యయం
జీతాలకు 33,776 కోట్లు
పెన్షన్లు 16,140 కోట్లు
వడ్డీలకు 12,258 కోట్లు
రుణ చెల్లింపు 5554 కోట్లు
జీతాల యేతర వ్యయం 3196 కోట్లు
సబ్సిడీలు, గ్రాంట్‌ఇన్‌ఎయిడ్ 13330 కోట్లు
అందులో రైతు రుణమాఫీ 3512 కోట్లు
విద్యుత్ సబ్సిడీ 3586 కోట్లు
ఉచిత బియ్యం సబ్సిడీ 2519 కోట్లు
-------------------------------------------
ప్రణాళికా వ్యయం
ఎస్సీ సబ్‌ప్లాన్ 8724 కోట్లు
ఎస్టీ సబ్‌ప్లాన్ 3100 కోట్లు
బిసి సబ్‌ప్లాన్ 8832 కోట్లు
కాపుకార్పొరేషన్‌కు 1000 కోట్లు
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 65 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి 702 కోట్లు
-------------------------------------------
శాఖలవారీ కేటాయింపులు
(కోట్లలో)

వ్యవసాయం 6815.09
పశుసంవర్ధకశాఖ 1340.65
పర్యావరణం 357.26
ఉన్నత విద్య 2644.64
ఇంధనం 4020.31
పాఠశాల విద్య 17502.65
ఆహారం 2702.20
ఆర్థిక శాఖ 36,313.53
సాధారణ పరిపాలన 498.69
ఆరోగ్యం 6103.76
హోం 4785.41
గృహనిర్మాణం 1132.83
జలవనరులు 7978.80
పరిశ్రమలు 975.77
ఐటి 360.22
కార్మిక శాఖ 398.01
న్యాయశాఖ 767.51
శాసన వ్యవహారాలు 114.39
మున్సిపల్ శాఖ 4728.95
పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ 1.43
ప్లానింగ్ 1136.55
పంచాయతీరాజ్ 16115.43
రెవిన్యూ 3119.72
నైపుణ్యాభివృద్ధి 376.39
బిసి సంక్షేమం 4430.17
సాంఘిక సంక్షేమం 3236.01
గిరిజన సంక్షేమం 1563.37
మైనార్టీ సంక్షేమం 710.57
మహిళా సంక్షేమం 1331.74
రవాణా 3387.80
యువజన సర్వీసులు 739.16
--------------------------