అక్షర

రెండర్థాల ‘యేసు కృష్ణీయము’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యేసు కృష్ణీయము
రెండర్ధాల కావ్యం
గాడేపల్లి కుక్కుటేశ్వరరావు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

‘రెండర్ధంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబు గాకుండు’ అన్నాడు పింగళి సూరన. ఒకనాడు ద్వ్యర్థి, త్య్రర్థి, చాతురార్ధక కావ్యాలు వెలువడ్డాయి. ఆధునిక కాలంలో అటువంటి కావ్యాలు చాలా చాలా తక్కువ. ఇటువంటి కావ్యరచనకి పాండిత్యం బాగా అవసరం. అది ఉన్న గాడేపల్లి కుక్కుటేశ్వరరావుగారు ‘యేసు కృష్ణీయము’ అనే రెండర్ధాల కావ్యం రాశారు. ఇది తెలుగు కావ్యాలలో విలక్షణమైనది. 1979లో గాడేపల్లివారు రాసిన ఈ ద్వ్యర్థి కావ్యానికి మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారు ముందు మాట రాశారు. ‘యేసు కృష్ణీయము’ అనే తలంపే నవ్యాతి నవ్యం. మత సామరస్యానికి ఇది నిలువుటద్దం. గాడేపల్లివారు ఉస్మానియానుంచి ఎంఎ పట్టా పొంది అనేక కావ్యాలు రాశారు. అవధానాలు చేసారు.
‘మరియ లోలత నెలలు సమాప్తి నమర
జంతు సాక్షిక నిర్బంధ శాలలోన
దేవకీ లాభమూర్తియై దేవదేవు
డవని ప్రభవించె దైవజ్ఞులాత్మనలరు’
ఈ మొట్టమొదటి పద్యంలో ఏసు జననం, శ్రీకృష్ణుని జననం రెండూ ఉన్నాయి.
మరియ అంటే మరియమ్మ
మరి+ఆలోలత అంటే ఏమాత్రమూ ఆటంకం లేకుండా
ఏసుపరంగా-మరియమ్మ ఆందోళన చెందుతుండగా నెలలు నిండినవి. అగ్ని తేజస్సు గల దేవ దేవుడైన ఏసు పశువుల పాకలో ఆమె కడుపున జన్మించెను. ప్రభు జననమునకు తూర్పుదేశ జ్ఞానులు సంతోషించిరి.
శ్రీకృష్ణపరంగా- గర్భ విషయంలో ఎటువంటి భంగపాటు లేకుండా నెలలు నిండాయి. ఎదురుగా గాడిదనిల్చి చూచుచున్న చెరసాలలో దేవదేవుడు (శ్రీకృష్ణుడు) జన్మించాడు. కృష్ణతత్వం తెలిసినవాళ్లు ఆనందించారు.
ఈ విధంగా ఒకే పద్యంలో ఏసు క్రీస్తు, శ్రీకృష్ణుల చరిత్ర మహిమలు వస్తాయి. పదాల విరుపువల్ల, పదాలకు గల అనేక అర్ధాల వల్ల ఇది సాధ్యమవుతుంది.
మరో పద్యం చూడండి-
శ్రీ కలిత విశ్వరూప
ప్రాకట దర్శనము గ్రుడ్డివానికి నిడెసు
శ్లోకుండు, బాపురె! యహో
వా కన్నయ్యకు సముండు ప్రభుండు కలండే?
ఏసుపరంగా- మిక్కిలికీర్తింప దగిన ఏసు, ఒకానొక అంధుడికి ప్రపంచ దర్శననిమిత్తం చూపునిచ్చాడు అహో! యహోవా కుమారుడై ఏసునకు సాటివచ్చు దైవమే లేదు.
విశ్వరూప ప్రాకటదర్శనము-ప్రపంచ ఆకారాన్ని చక్కగా దర్శింపగల చూపు-అని ఏసుపరంగా.
‘విశ్వరూపాన్ని దర్శింపగల చూపును ప్రసాదించిన-అని కృష్ణపరంగా
యెహోవా కన్నయ్య అంటే ఏసుపరంగా యెహోవా కుమారుడైన ఏసు అని భావం.
అహో! వా! (వహ్వా) అని కృష్ణుని పరంగ ప్రశంస!
ప్రభువు అంటే ఏసు, దేవుడు అని అర్ధాలు
ఇక కృష్ణపరంగా భావం ఇది-
‘కీర్తింపదగిన శ్రీకృష్ణుడు మహా శోభావంతమైన తన విశ్వరూపమును ధృతరాష్ట్రుడికి చూపాడు. ఆహా! కృష్ణుడికి సాటియైన దేవంలేడు గదా!
ఈవిధంగా తొమ్మిది పద్యాలలో ఏసు ప్రభువుకీ, శ్రీకృష్ణుడికీ అన్వయించి రాసారు గాడేపల్లివారు.
‘శ్రీకృష్ణాద్భుత గాధ రక్తగతమై క్రీస్తు ప్రభుఖ్యాతియస్తోకాకర్ణితమాయె నొక్క నిశినే చూడంతటస్థించెమిత్రా కాంక్షన్ ‘కరుణామయుండ’ నెడు చిత్రంబప్పుడన్పించె ద్వ్యర్థ్యాకారమ్మున నీ ప్రబంధమున్ వ్రాయన్ వ్రాసితించెచ్చెరన్’’ ఈ చిరుకావ్యాన్ని ధారాళంగా రాశారట! తెలుగు భాషకి వనె్న తెచ్చిన అనేకార్ధ కావ్యాలకి ఈ ‘యేసు కృష్ణీయము’ ఒక మేలుచేర్పు!

-ద్వానా శాస్త్రి