తెలంగాణ

వటపత్రశాయిగా లక్ష్మీనరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్న వాహనంపై ఊరేగింపు

నల్లగొండ, మార్చి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అలంకార సేవలు, వాహన సేవలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఐదవ రోజు వటపత్రశాయిగా లక్ష్మీనరసింహుడు పెండ్లీకొడుకుగా ముస్తాబై తిరువీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని వటపత్రశాయి అంలకార సేవలో దర్శించుకుని తన్మయులయ్యారు. రాత్రి పంచనారసింహుడైన స్వామివారు పొన్న వాహనంపై శృంగార నారసింహుడిగా దర్శనమిస్తూ మంగళవాయిద్యాల మధ్య తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అలంకార సేవ, వాహనసేవా తంతులను ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్తయ్రుక్తంగా వైభవంగా నిర్వహించింది. ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది స్వామి వారి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాహన సేవలలో నేడు: యాదాద్రి లక్ష్మీనరసింహుడు అలంకార, వాహన సేవలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం ఉదయం స్వామివారికి గోవర్ధనగిరిధారిగా అలంకార సేవ, రాత్రి నరహరిగా సింహవాహన సేవలను నిర్వహించనున్నారు. బుధవారం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించనుండగా దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి గుట్టకు రానున్నారు. 17వ తేదీన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం నిర్వహించనుండగా గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల నిర్వాహణకు దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది.
(చిత్రం) వటపత్రశాయిగా తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహుడు