ఆంధ్రప్రదేశ్‌

సుప్రీంలో వైకాపాకు ఎదురుదెబ్బ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా ఎపి అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ వైకాపా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టులో ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. తమ పార్టీ తరఫున గెలిచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు కోర్టుకు, స్పీకర్‌కు పిటిషన్లు సమర్పించారు. అయితే, సాంకేతిక లోపాలున్నందున రెండు పిటిషన్లను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇటీవల తిరస్కరించారు. ఈ విషయమై సమాచారం సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో మూడో పిటిషన్‌ను కూడా తాము తిరస్కరిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు పరిధిలోనే తేల్చుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. 3 నెలల లోగా ఈ పిటిషన్‌ను విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ వైకాపా చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీం తిరస్కరించింది.