రాష్ట్రీయం

వైకాపాకిమంచి రోజులు: మేకపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేసారి పోయారని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైకాపాకు వచ్చేవన్నీ మంచిరోజులేనని, పార్టీ కార్యకర్తలు, నేతలు టిడిపి దుష్టపరిపాలనపై ప్రజల్లోకి వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో వైకాపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలు ఐదేళ్లకోసం రాజకీయ పార్టీని ఎన్నుకుని ఓట్లు వేస్తారని, టిడిపి విషయంలో రెండేళ్లకే ప్రజలకు విసుగు పుట్టిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అనైతిక పాలనను కొనసాగిస్తున్నారన్నారు. అమరావతి వద్ద రాజధాని వస్తుందనే విషయాన్ని కొంతమంది సన్నిహితులు, మంత్రులకు చెప్పి వారి చేత భూసమీకరణలోకి రాని భూములను కొనుగోలు చేయించి స్ధానిక రైతులను మోసం చేశారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను మర్చిపోలేదన్నారు. ఆరోగ్య శ్రీ బ్రష్టు పట్టిందన్నారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి సంగతిని మర్చిపోయారన్నారు. వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు జి ఈశ్వరి, ఆర్‌కె రోజా, విశే్వశ్వరరెడ్డి పాల్గొన్నారు. (చిత్రం) పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే రోజా