S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/11/2017 - 21:15

శేఖర్, దీప్తి జంటగా నరేష్.పి దర్శకత్వంలో కె.ఎన్.రావు రూపొందించిన చిత్రం ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను మార్కెట్‌లో విడుదల చేశారు. టీజర్‌కు దాదాపు మూడు లక్షల వ్యూస్ లభించాయని నిర్మాత తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- వెరైటీ కథనంతో మరింత వైవిధ్యమైన టైటిల్‌తో ఈ చిత్రం ఇప్పటికే క్రేజ్ సాధించిందని, ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో తెరకెక్కించామని తెలిపారు.

05/10/2017 - 20:59

బాలీవుడ్ భామ అలియాను బంపర్ ఆఫర్ వరించింది. సక్సెస్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ సీక్వెల్‌గా పేరు తెచ్చుకున్న ‘ఆషికి-2’లో ఆదిత్య రాయ్‌కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా నటించారు. సీక్వెన్స్ సీక్వెల్‌గా రాబోతున్న ఆషికి-3లో సిద్ధార్థ్ మల్హోత్రా, అలియాభట్ జోడీగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్స్ ప్రకటించింది.

05/10/2017 - 20:57

సెంచరీ దాటడంతో బాలకృష్ణ స్పీడ్ పెంచుతున్నాడు. బాలకృష్ణ హీరోగా సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో సి కల్యాణ్ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలయ్య 102వ సినిమాగా రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. రజనీకాంత్‌తో నరసింహవంటి భారీ హిట్ అందించిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయడం తొలిసారి.

05/10/2017 - 20:56

సింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శతృఘ్న రాయపాటి (యుఎస్‌ఎ) స్ట్ఫోనీ, జోసెలిన్ తారాగణంగా రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహన్ ఆర్, నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. నటుడు చలపతిరావు మాట్లాడుతూ దర్శకుడు రమణారెడ్డి అమెరికా వెళ్లి రమ్స్‌గా పేరు మార్చుకున్నారన్నారు.

05/10/2017 - 20:54

కళ్యాణ్, లక్ష్మీశిల్ప జంటగా శ్రీ లక్ష్మీ లోహితా క్రియేషన్స్, శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ పతాకాలపై సత్య దర్శకత్వంలో టి రామకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవర్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. నాగబాబు ప్రారంభించిన పూజా కార్యక్రమాలు అనంతరం నటి కవిత హీరో హీరోయిన్లపై క్లాప్‌నిచ్చారు.

05/10/2017 - 20:53

పాత్ర నచ్చితే బార్డర్స్ దాటడానికి వెనుకాడనని అంటోంది సుప్రియ ఐసోల. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో వచ్చిన ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో సుప్రియ ఓ కథానాయిక. ఇటవలే చిత్రం విడుదలైన నేపథ్యంలో సుప్రియ మీడియాతో ముచ్చటించింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. థియేటర్స్ ఆర్టిస్టుని. ఎన్నో నాటకాల్లో నటించాను. ఈక్రమంలో ‘సశేషం’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. తర్వాత ‘్భ’ అనే మరో సినిమా చేశా.

05/10/2017 - 20:52

తాడు బలంగావుంటే 3పోర్ట్2కి 3్ఫర్ట్2కి లంకె పెట్టొచ్చని నిరూపించాడు -జక్కన్న. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న హాట్ టాపిక్ ఇది. పదేళ్ల క్రితం 3పోర్ట్2ను బేస్ చేసుకుని నడిపించిన 3్ఛత్రపతి2కి, తాజాగా 3్ఫర్ట్2 చుట్టూ తిప్పిన బాహుబలి కథకు దగ్గర పోలికలున్నాయన్నది పరిశీలకుల మాట. అది సామాజికం, ఇది జానపదం. అయినా మూల కథలోని సారం మాత్రం 3సేమ్ ధ్రెడ్2 అన్నది వీళ్ల వాదన.

05/10/2017 - 20:49

రామయణాన్నీ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. మహాభారతాన్ని వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలవ్వగా, ఇప్పుడు రామాయణాన్నీ రూ. 500 కోట్లతో నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును 3డిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుందట.

05/10/2017 - 20:49

ఆర్‌జె సినిమాస్ పతాకంపై హరీశ్, అవంతిక జంటగా జయ బి దర్శకత్వంలో బిఎ రాజు నిర్మిస్తున్న లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ వైశాఖం. చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అచ్చమైన తెలుగు టైటిల్‌తో రూపొందించిన సినిమా ట్రైలర్ బాగుందని, వినగానే పాజిటివ్‌గా అనిపించిందన్నారు.

05/10/2017 - 20:47

ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ దక్కింది. వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటున్న అనుపమ, మరోసారి నాగచైతన్య సరసన నటించేందుకు ఓకే చెప్పడం విశేషం. లేటెస్టుగా వీరిద్దరూ కలిసి ప్రేమమ్ రీమేక్‌లో నటించారు. ఆ సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో ఈ జంటకు క్రేజ్ పెరిగింది.

Pages