S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/09/2019 - 12:54

షిల్లాంగ్: శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. నిన్న సాయంత్రమే షిల్లాంగ్ వచ్చిన రాజీవ్ శనివారం ఉదయం సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు రాజీవ్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది.

02/09/2019 - 00:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 30,000 కోట్ల రూపాయలు అపహరించారని రాహుల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

02/09/2019 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు మల్టీనేషనల్ కంపెనీల తరఫున పనిచేస్తూ దేశానికి నష్టం కలిగిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

02/08/2019 - 23:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంలో ఎస్‌స్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుందని మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు. వీలుంటే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపాదిస్తామని శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో స్పష్టం చేశారు.

02/08/2019 - 23:21

సిమ్లాలో భారీగా కురుస్తున్న హిమ పాతానికి మంచులో కూరుకుపోయిన రోడ్డు

02/08/2019 - 23:05

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సీబీఐ సంస్థకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రధాని కార్యాలయం (పీఎంఓ)పై దాడులు నిర్వహించి అన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని, రాఫెల్ విమానాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం డిమాండ్ చేశారు.

02/08/2019 - 23:02

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 8: కర్నూలు సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్(సీఎఫ్‌టీఆర్‌ఐ) రీసోర్స్ సెంటర్ ఏర్పాటుచేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి శుక్రవారం రాజ్యసభలో ఈ విషయం తెలిపారు.

02/08/2019 - 23:02

కోల్‌కొతా, ఫిబ్రవరి 8: ప్రధాని నరేంద్రమోదీ అవినీతి చక్రవర్తి అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. రాఫెల్ స్కాం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ఆమపె చెప్పారు. దేశంలోని అతి పెద్ద స్కాంలలో రాఫెల్ ఒకటన్నారు. పెద్ద ఎత్తున ఈ స్కాంలో ముడుపులు చేతులు మారాయన్నారు. రాఫెల్ డీల్ దేశానికి మచ్చ అన్నారు.

02/08/2019 - 22:55

భోపాల్, ఫిబ్రవరి 8: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ డాక్టర్ రామకృష్ణ కుసుమారియా శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానంలో భాగంగా రైతులకు రుణ మాఫీ చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.

02/08/2019 - 22:53

జమ్ము, ఫిబ్రవరి 8: జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగం శుక్రవారం ప్రత్యేకంగా లడఖ్ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు లడఖ్ కాశ్మీర్ డివిజన్‌లో భాగంగా ఉంది. ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు కావడంతో ఇప్పుడు లడఖ్‌కు ప్రత్యేకంగా ఒక డివిజనల్ కమిషనర్, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఉండబోతున్నారు.

Pages