తెలంగాణ

రాజ్‌భవన్ ఎదుట విహెచ్ మెరుపు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, ఏప్రిల్ 1: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వరాదన్న డిమాండ్‌తో ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు శనివారం అనూహ్యంగా రాజ్‌భవన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. దీంతో కంగారుపడిన పోలీసులు అక్కడికి చేరుకుని విహెచ్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. విహెచ్ వారి మాట వినకపోగా రాజ్‌భవన్‌లోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.
అంతకు ముందు విహెచ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా, అటువంటి వారితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిరాకరించాలని ఆయన గవర్నర్‌ను కోరారు. తెలంగాణలో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారని ఆయన తెలిపారు. అయితే తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ తప్పు చేశారని అన్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై టిడిపిలో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చేందుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో చేసిన తప్పునే గవర్నర్ ఆంధ్రలో కూడా చేయవద్దని ఆయన కోరారు. అయినా గవర్నర్ అటువంటి తప్పునే మళ్లీ చేస్తే గవర్నర్‌ను బర్తరఫ్ చేయాల్సిందిగా రాష్టప్రతిని కలిసి కోరనున్నట్లు విహెచ్ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను ఉద్యమాన్ని కొనసాగిస్తానని ఆయన తెలిపారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపి వి. హనుమంతరావు