ఆంధ్రప్రదేశ్‌

చెత్త వేయి.. కూపన్ అందుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వినూత్న పథకానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న వేస్ట్ వెల్త్ బిన్‌లే ఆదాయ మార్గాలుగా మారనున్నాయి. ఈ బిన్‌లో ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ టీ కప్పులు, కూల్ డ్రింక్‌ల సీసాలు వంటివి వేయగానే అందులో నుంచి ఒక కూపన్ వస్తుంది. విజయవాడ నగరంలోని వివిధ వాణిజ్య సముదాయాల్లో, షాపింగ్ మాల్స్‌లో ఈ కూపన్‌లు చెల్లుబాటు అయ్యేలా డిజైన్ చేశారు. ఈ తరహా బిన్‌లను ప్రయోగాత్మకంగా వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేశారు. మొదట విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి ఫలితాలను బేరీజు వేసుకుని రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘాల్లో అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ బిన్‌లో చెత్త వేసేందుకు వచ్చిన వారు యువకులా.. మహిళలా.. పిల్లలా.. వృద్ధులా.. అన్న వివరాలను నమోదు చేస్తుంది. ఆయా వర్గాలకు చెందిన ప్రభుత్వ పథకాలు స్క్రీన్‌పై ఆవిష్కృతమవుతాయి. మొబైల్ చార్జర్, షూ పాలిషింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, 10 కేంద్రాల్లో 64 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ బిన్ పని చేసే విధానాన్ని మంగళవారం మీడియాకు మంత్రి వివరించారు.
పురసేవ యాప్‌కు అవార్డు
పురపాలక సంఘాల పరిధిలోని వివిధ సమస్యలను ఆన్‌లైన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు రూపొందించిన పురసేవ యాప్‌కు ఎకనమిక్ టైమ్స్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ తెలిపారు.