కృష్ణ

కల్తీ మద్యం కేసులో బాధితులు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. 125ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాది అని ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర విభజనలో బొక్కబోర్లా పడి రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిందన్నారు. విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు తమ పాదాల కింద కాంగ్రెస్ పార్టీని తొక్కి నార తీశారన్నారు. ఘనత వహించిన మేఘమధనం ఫేమ్ డా.రఘువీరారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతుందన్నారు. విజయవాడ కల్తీ మద్యం కేసులో ఐదుగురు దుర్మరణం చెంది, పలువురు అంగవైకల్యం చెంది, మరికొంత మంది మతిస్థిమితం కోల్పోయి బాధలు పడుతూ ఉంటే ఈ దుర్గార్గానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వెనకేసుకురావటం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. జిల్లా జైలుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ జైలులో ముద్దాయిగా విష్ణును పలకరించటం జరిగిందన్నారు. చనిపోయిన ఐదుగురు కుటుంబాలను కాని, అంగవైకల్యంతో బాధపడుతున్న అభాగ్యులను పరామర్శించకపోవటం విడ్డూరమన్నారు.