ఆంధ్రప్రదేశ్‌

కాలుష్య నియంత్రణకు ఆధునిక టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 10: రోజు రోజుకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మం డలి వినూత్న తరహాలో నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. కాలంచెల్లిన కాలుష్య నియంత్రణ విధానాలకు స్వస్తిపలికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఈ సదస్సుల్లో నిపుణులు సూచిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్ క్లినిక్ పేరిట నిర్వహిస్తున్న ఈ సదస్సుల్లో ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమల కాలుష్య నియంత్రణ విధానాలపై అవగాహన పెంపొందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం పేపర్‌మిల్లుల కాలుష్య నియంత్రణపై ఎన్విరానె్మంటల్ క్లినిక్ నిర్వహించారు. కాలుష్య నియంత్రణలో లోపం ఎక్కడుందో గమనించి నివారణ చర్యలు చేపట్టాల్సి వుందని, నిపుణుల సూచనలమేరకు కాలుష్య నియంత్రణకు పేపర్‌మిల్లులు ఆధునిక విధానాలు అవలంబించాలని ముఖ్యఅతిథిగా హాజరైన కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్, విశ్రాంత ఐఎఎస్ అధికారి డాక్టర్ జిఎన్ ఫణికుమార్ అన్నారు. కాగితం అనేది ఒక జ్ఞానవాహిక అని, సమాజంలో పేపర్ అవసరం పెరుగుతూనే ఉందన్నారు. జల, వాయు, ఘన పదార్థాల కాలుష్యం ఈ పరిశ్రమల్లో అధికంగా ఉందన్నారు.
పేపర్ పరిశ్రమలో నీటి వాడకం తగ్గించాలని తెలిపారు. ఒక టన్ను పేపర్ ఉత్పత్తికి మన దేశంలో 250 క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తుంటే అభివృద్ధిచెందిన దేశాల్లో 75 క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతున్నారన్నారు. దేశంలో 1122 మిలియన్ క్యూబిక్ మీటర్ల వనరు ఉంటే అందులో 38 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నారని, అందులో 80 శాతం వ్యవసాయానికి పోతే, 9 శాతం పరిశ్రమలకు, 4 శాతం దైనందిన జీవనానికి వినియోగిస్తున్నారని వివరించారు. రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు నుంచి విడుదలయ్యే కాలుష్య జలాలను అప్ప ట్లో లంకల్లోకి వదులుతున్నామని చెప్పేవారని, అయితే ఆధునిక విధానాల్లో ట్రీట్‌మెంట్ చేయాల్సివుందన్నారు. పరిశ్రమలు ప్రజా కంటకం కాకూడదన్నారు. ప్రజా ఉద్యమాన్ని ఎవరూ అడ్డుకోలేరని, పరిశ్రమల కారణంగా కాలుష్యానికి మనం కార ణం కాకూడదనే దీక్ష పరిశ్రమల యాజమాన్యాలు చేపట్టాలని డాక్టర్ ఫణికుమార్ పేర్కొన్నారు. పేపర్ పరిశ్రమ ప్రజా కంటకంకాదని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల నుంచి ఉత్పత్తులే కాదు కాలుష్యం కూడా విడుదలవుతోందని, ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి కాలుష్య నియంత్రణ పద్ధతులు కాకుండా ఆధునిక టెక్నాలజీని వినియోగించాలన్నారు. రీసైక్లింగ్ పేపర్ యూనిట్లను మరింతగా ప్రోత్సహించాల్సివుందని, జాయింట్ చీఫ్ ఎన్విరానె్మంటల్ ఇంజనీర్ శివారెడ్డి చెప్పారు.
పేపర్ మిల్లులకు ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి వినియోగం 2030 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారని తెలిపారు. పేపర్ పరిశ్రమలో 93 శాతం కలప ద్వారానే ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఒక ఎ ఫోర్ సైజ్ పేపర్ తయారు చేయాలంటే 10 లీటర్ల నీరు అవసరమని, ఒక చెట్టు నుంచి ముగ్గురికి అవసరమయ్యే ఆక్సిజన్ అందుతుంటే, అటువంటి చెట్టును పేపర్ పరిశ్రమ కోసం నరికేస్తున్నారని, అందుకే రీసైక్లింగ్ పేపర్ పరిశ్రమను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందన్నారు.