బిజినెస్

వెంకటేశన్ ఇన్ఫీ కో-చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 13: దేశీయ ఐటి దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫీ (ఇన్ఫోసిస్) తమ స్వతంత్ర డైరెక్టర్ రవి వెంకటేశన్‌ను కో-చైర్మన్‌గా నియమించింది. డైరెక్టర్ల బోర్డును విస్తరించాలని సంస్థ వ్యవస్థాపకుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఇన్ఫోసిస్ గురువారం ఆయనను ఈ పదవిలో నియమించింది. సిఇఓ వేతన పెంపు వ్యవహారంతో పాటు మాజీ ఉద్యోగులకు సెవెరెన్స్ ప్యాకేజీ, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు తదితర అంశాల విషయమై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, యాజమాన్యానికి మధ్య ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో రవి వెంకటేశన్‌ను సంస్థ కో-చైర్మన్‌గా నియమించి బోర్డును విస్తరించడం గమనార్హం. సంస్థ భవిష్యత్ వ్యూహాన్ని అమలు చేయడంలో యాజమాన్యానికి తోడ్పాటును అందించే విధంగా బోర్డు పనితీరును మెరుగుపర్చడంలో రవి వెంకటేశన్ తనకు సహాయ సహకారాలు అందజేస్తారని ఇన్ఫోసిస్ చైర్మన్ ఆర్.శేషసాయి ఒక ప్రకటనలో వెల్లడించారు. 2011 ఏప్రిల్ నుంచి ఇన్ఫోసిస్ బోర్డులో కొనసాగుతున్న రవి వెంకటేశన్ సంస్థ వ్యూహాత్మక ఎదుగుదలకు ఎనలేని సేవలను అందించారని శేషసాయి ఆ ప్రకటనలో కొనియాడారు. ఇదిలావుంటే, టెక్నాలజీ పరిశ్రమకు ఎంతో కీలకమైన ఈ తరుణంలో ఇన్ఫోసిస్ చైర్మన్ శేషసాయి, సిఇఓ విశాల్ సిక్కా, ఆయన లీడర్‌షిప్ టీమ్‌తో కలసి మరింత సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని రవి వెంకటేశన్ తెలిపారు.

చిత్రం..రవి వెంకటేశన్