ఆంధ్రప్రదేశ్‌

పేదరికం లేని సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: వీధి బాలలకు విద్యా, ఆరోగ్య సాధికారత, గౌరవ ప్రదమైన జీవన విధానాలకు మెప్మా రూపకల్పన చేసిన రాగ్ పికర్స్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. చిత్తు కాగితాలు ఎరుకునే వీధి బాలల జీవన విధానం తదితర అంశాలపై ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ పేదరికంలేని సమాజ సృష్టి కోసం పని చేస్తున్నామని, ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10వేల ఆదాయం కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. వీధి బాలలకు కౌన్సిల్ ద్వారా చదువు నేర్పించటం, భవిష్యత్‌లో గౌరవ ప్రదమైన వృత్తిలో స్థిరపడేందుకు మార్గం రూపొందించాల్సి ఉందన్నారు. వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, స్వచ్ఛాంద్ర మిషన్ అధ్యక్షుడు సిఎం వెంకటరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, తదితర అధికారులు పాల్గొన్నారు.