కృష్ణ

మహిళలదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 21: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసింది. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. తాజా గణాంకాల ప్రకారం ఓటర్ల జాబితాలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. జిల్లాలో మొత్తం 28లక్షల 76వేల 921 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో పురుష ఓటర్లు 14లక్షల 26వేల 392 మంది కాగా, మహిళా ఓటర్లు 14లక్షల 49వేల 473 మంది నమోదయ్యారు. పురుష ఓటర్ల కన్నా 23వేల 81 మంది మహిళా ఓటర్లు అధికంగా నమోదు కావడం విశేషం. థర్డ్ జెండర్ 186, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న వారు, సైన్యంలో పనిచేసే వారివి 870 ఓట్లు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది. ఓటర్ల చేర్పులు, తొలగింపు, పేరు మార్పు, తదితరాలకు అవకాశం కల్పించారు. ఓటర్ల చేర్పలకు సంబంధించి 14వేల 896 దరఖాస్తులు అందగా 11వేల 261 అర్జీలను ఎన్నికల సంఘం ఆమోదించింది. తొలగింపునకు సంబంధించి 2170 దరఖాస్తులు రాగా 1925 పేర్లు తొలగించారు. పేరు మార్పు, తదితరాల విషయంలో 5వేల 609 అర్జీలకు 3వేల 431 అర్జీలకు పరిష్కారం చూపారు. పోలింగ్ కేంద్రాల మార్పుకు 972 ప్రతిపాదనలు రాగా 492 కేంద్రాలకు ఆమోదం లభించింది. గత జాబితాతో పోలిస్తే 13వేల 154 మంది ఓటర్లు ప్రస్తుతం వెల్లడించిన తుది జాబితాలో పెరిగారు. జిల్లాలో మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా అందులో గన్నవరం నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు నమోదయ్యారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటర్లు నమోదు కావడం విశేషం. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆక్రమణల తొలగింపు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: నగర వ్యాప్తంగా ప్రధాన రహదారుల కిరువైపులా ట్రాఫిక్‌కు అవాంతరాలు సృష్టిస్తున్న రోడ్‌సైడ్ వ్యాపారుల తొలగింపు చర్యలు మూడోరోజైన గురువారం కూడా కొనసాగాయి. తొలుత విఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు తమ సిబ్బందితో గవర్నర్‌పేటలోని ఆంధ్రా హాస్పటల్ రోడ్డుకు చేరుకొని రహదారి కిరువైపులా ఉన్న ఆక్రమిత వ్యాపారాలతోపాటు స్థానిక దుకాణందారులకు చెందిన ఆక్రమణలను కూడా తొలగించారు. డిస్‌ప్లే బోర్డులతోపాటు బిల్డింగ్ సెట్‌బ్యాక్ స్థలాల అరుగులపై ఏర్పాటుచేసిన జనరేటర్ వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో తొలగింపు చర్యలు చేపట్టారు. తొలగింపు చర్యల్లో ఎదురవుతున్న వ్యాపారుల నిరసనల నేపథ్యంలో విఎంసి అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను మొహరింపజేశారు. ఈ తొలగింపు చర్యల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు బేగ్, పద్మావతి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అర్బన్ ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి
ఎదురుదెబ్బ
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: నగరంలోని విఎంసి అరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్న వివిధ స్వచ్చంధ సంస్థల కాంట్రాక్ట్‌ను అధికారులు రద్దు చేశారు. కనీస వేతనాల అమలు కోరుతూ నలభై రోజులకు పైగా నిరసన దీక్షలు చేస్తున్న ఆరోగ్య కేంద్రాల సిబ్బంది స్థానాల్లో ప్రత్యమ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేసి కేంద్రాల్లో ఆరోగ్య సేవలను కొనసాగించాలంటూ విఎంసి అధికారులు కొద్ది రోజుల క్రితం జారీ చేసిన నోటీసులకు స్పందించని సంస్థల తీరుకు నిరసనగా అధికారులు వారి కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం సంస్థల కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో ఆయా సంస్థలు ద్వారా నియామకమైన సిబ్బంది కాంట్రాక్ట్ కూడా రద్దయినట్టేనని అధికారులు తెలుపుతున్న వైనం గమనార్హం. అంతేకాకుండా బుధవారం జిల్లా అధికారులతో సిబ్బంది, వారి యూనియన్ నాయకులు నిర్వహించిన చర్చలు విఫలమవ్వడమే కాకుండా కనీస వేతనాల అమలులో కార్మిక చట్టాలను విఎంసి అధికారులు అతిక్రమిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా ఆరోగ్య కేంద్రాలను నిర్వహించేందుకు గాను నూతన సంస్థలను ఆహ్వానించగా సుమారు 15 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయ.