కృష్ణ

సంక్షేమానికి దశా, దిశ నిర్దేశిస్తున్న బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జనవరి 21: బ్యాంకులను జాతీయం చేసిన తర్వాతే పేదలు, రైతుల అభ్యున్నతికి నాంది పలికాయని, ఈరోజు జాతీయ బ్యాంకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు, ప్రజలకు అందిస్తున్న సేవల వల్లనే సంక్షేమం దిశగా దేశం అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వ ‘ఆధార్’ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంవిఎస్ రామిరెడ్డి అన్నారు. స్థానిక ఆంధ్రా బ్యాంక్ భవనం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎటిఎం, డిపాజిట్ మిషన్ల కౌంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బ్యాంకు ఖాతాదారుల సమావేశంలో రామిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా బ్యాంక్ దేశంలో అత్యుత్తమ సేవలందిస్తూ అగ్ర భాగాన ఉండటం అభినందనీయమన్నారు. 40శాతం వ్యవసాయ రంగ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న ఆంధ్రా బ్యాంక్ ప్రజల బ్యాంక్ అని శ్లాఘించారు. డిజిఎం జివి కృష్ణారావు మాట్లాడుతూ బ్యాంకుకు ఖాతాదారులే యజమానులని పేర్కొంటూ దేశంలో 2760 శాఖలు, కృష్ణా జిల్లాలో 113 శాఖలతో సేవలు అందిస్తోందని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ నరసింహారావు, బ్యాంక్ భవన యజమాని, సీనియర్ ఖాతాదారుడు నందిపాటి పద్మారెడ్డి, తదితరులు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.

అర్చకుల స్వాధీనంలోని
భూములకు పట్టాలివ్వాలి

అవనిగడ్డ, జనవరి 21: సర్వీసులో ఉన్న అర్చకులకు వారి స్వాధీనంలో ఉన్న ఆలయ ఈనాం భూములను అనుభవదారులుగా పట్టాదార్ పాస్ పుస్తకంలో చేర్చాలని తహశీల్దార్ వెనె్నల శ్రీనుకు అర్చక సమాఖ్య నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. డి వెంకట్రామాచార్యులు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ను కలిశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ గత అక్టోబర్‌లో ఆదేశాలు జారీ చేసినందున వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీచేయాల్సి ఉందని, జీవో రాగానే అమలు చేస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఈసందర్భంగా వెంకట్రామాచార్యులు విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నెల 30న బందరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో బందరు డివిజన్ అర్చకుల సమావేశం సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఆ సమావేశంలో కాకినాడ డెప్యూటీ కమిషనర్, జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు ఆలయ ఇఓలు పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా అర్చకులు సమస్యలను రాతపూర్వకంగా సమర్పిస్తే అధికారుల సమక్షంలో అప్పటికప్పుడే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందావనం వేణుగోపాలాచార్యులు, పెనుమూడి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

కాపు కార్పొరేషన్‌కు 2,462 యూనిట్లు

కూచిపూడి, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీలతో కూడిన రుణాలుగా 2,462 యూనిట్లు కేటాయించినట్లు బిసి కార్పొరేషన్ ఇడి ఎన్ పుష్పలత తెలిపారు. గురువారం స్థానిక సప్తగిరి బ్యాంక్ మేనేజర్‌తో ఆమె కార్పొరేషన్ రుణాలపై చర్చించారు. ప్రభుత్వం కేటాయించిన యూనిట్లు మార్చి నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. బ్యాంకులో పెండింగ్‌లో ఉన్న పాడి పరిశ్రమ యూనిట్లకు సంబంధించిన అంశంపై మేనేజర్ మద్దాల సుందరరావుతో ఆమె చర్చించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ కాపు కార్పొరేషన్‌కు తొలివిడతగా రూ.14.76కోట్ల విలువైన యూనిట్ల స్థాపనకు ఆ వర్గాను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో రూ.7.38కోట్లు సబ్సిడీగా ఉంటాయన్నారు.