తెలంగాణ

వ్యవసాయానికి అనుబంధంగా ఎన్‌ఆర్‌ఇజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుబంధం చేయాలని కేంద్రాన్ని కోరుతూ టిఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించడానికి కృషి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ సమావేశంలో ఎన్‌ఆర్‌ఇజిపి పథకాన్ని వ్యవసాయానికి అనుబంధంగా మార్చాలని కోరుతానని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ద్వారా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని ముఖ్యమంత్రి అన్నారు. పేదల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమానికి సింహభాగం రూ. 35 వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభినందిస్తూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టగా ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బుడాన్ బేగ్ బలపరిచారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపి, శ్రేయోరాజ్యంగా ముఖ్యమంత్రి తీర్చిదిద్దుతున్నారని పాయం వెంకటేశ్వర్లు కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే కారు చీకట్లు కమ్ముతాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అలాంటి దశ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ లోటు లేని రాష్ట్రంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దడమే కాకుండా భవిష్యత్‌లో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోందని విద్యుత్ రంగంపై ప్రవేశపెట్టిన తీర్మానంలో ఆయన కొనియాడారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టం-వృత్తిపనులకు ప్రోత్సాహంపై ఎమ్మెల్యే కొండా సురేఖ తీర్మానం ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బలపరిచారు.
నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో నూతనాధ్యాయంపై ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఎన్ నిరంజన్‌రెడ్డి తీర్మానం ప్రతిపాదించగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బలపరిచారు. వినూత్న విధానాలు-ప్రగతి కాముక పథకాలపై ఎంపి బి వినోద్‌కుమార్ తీర్మానం ప్రతిపాదించగా, మరో ఎంపి బాల్క సుమన్ బలపరిచారు. తాగునీటి వ్యథ తీర్చే మిషన్ భగీరథపై ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రతిపాదించగా, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బలపరిచారు. సామాజిక రుగ్మతలపై సమరం తీర్మానాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుప్రతిపాదించగా ఎమ్మెల్యే గొంగిడి సునీత బలపరిచారు.