రాష్ట్రీయం

మంత్రులు ఇచ్చిన హామీల సంగతేమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: రాజధాని అమరావతి ప్రకటించిన నాటి నుంచి అన్ని విధాలా రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తున్న తుళ్లూరు ప్రజలు తొలిసారిగా మాస్టర్‌ప్లాన్ సదస్సును బహిష్కరించి సంచలనం సృష్టించారు. గురువారం సదస్సును నిర్వహించేందుకు సిఆర్‌డిఎ అధికారులు చేసిన యత్నాన్ని అడ్డుకున్న గ్రామస్థులు రెండు గంటల సేపు రహదారిపై బైఠాయించారు. రాష్టమ్రంత్రులు, సిఆర్‌డిఎ కమిషనర్, జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరు కాకుండా మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తే ఎంతమాత్రం ఒప్పుకునేది లేదంటూ భీష్మించారు. గతంలో మంత్రులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎప్పటికప్పుడు కాలయాపన చేస్తూ, పనులు చేసుకుంటూ అధికారులు ముందుకు వెళ్లడాన్ని ఉపేక్షించేది లేదన్నారు. గతంలో అసైన్డ్ భూముల రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. మెట్టరైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కంటే 100 గజాలు పెంచి స్థలం కేటాయిస్తామన్న హామీ ఇంత వరకు నెరవేరలేదన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదన్నారు. గ్రామకంఠాల సమస్యను వదిలేసి మాస్టర్‌ప్లాన్ అంటూ ముందుకెళ్తున్న అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. సదస్సును నిర్వహించేందుకు ప్రయత్నించిన అధికారుల మాటలు వినేందుకు ససేమిరా అన్నారు. గ్రామకంఠాల జాబితాను తయారు చేసి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సిఆర్‌డిఎ అధికారులకు అప్పగిస్తే దానిలో మార్పులు చేర్పులు చేయడాన్ని ఎంతమాత్రం అంగీకరించబోమన్నారు. ఏ ప్రాతిపదికన గ్రామకంఠాల్లో మార్పులు చేశారో స్పష్టంచేయాలన్నారు. గ్రామం వెలుపల ఉన్న వేరే రైతు పొలాన్ని గ్రామకంఠంలో చేర్చడంపై మండిపడ్డారు. గద్దె మంగయ్య మాట్లాడుతూ అధికారులు బదిలీపై వెళ్తుంటారని, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇచ్చిన హామీకే ఎటువంటి ఫలితం కనిపించడం లేదని, అందువల్ల ప్రభుత్వ ఇచ్చే ప్రతిహామీ లిఖితపూర్వకంగా కావాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం మందడం గ్రామంలో జరిగిన మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుకు సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ తదితరులు హాజరై రైతుల సందేహాలను నివృత్తిచేశారు. రైతు బెజవాడ సాంబయ్య మాట్లాడుతూ కేంద్ర రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులకు వేరే ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తామంటే ఒప్పుకోబోమన్నారు.
మల్కాపురంలోనూ అదే వరస
గ్రామకంఠాలపై స్పష్టత ఇవ్వకుండా మాస్టర్ ప్లాన్‌పై సదస్సులు నిర్వహించేందుకు యత్నించిన సిఆర్‌డిఎ అధికారులకు మల్కాపురంలోనూ గ్రామస్థులు షాక్ ఇచ్చారు. భూ సమీకరణ చటాన్ని వ్యతిరేకిస్తూ మల్కాపురం రైతులు సిఆర్‌డిఎ అధికారులు గురువారం చేపట్టిన అవగాహన సదస్సును బహిష్కరించారు. అధికారులు గ్రామకంఠాల జాబితా విడుదల చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. తుళ్లూరు గ్రామంలో సదస్సును బహిష్కరించిన ప్రభావం మిగిలిన గ్రామాలకూ పాకింది.