రాష్ట్రీయం

భరణం చాలదంటూ బిడ్డను వదలివెళ్లిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 21: తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఓ శిశువుకు శాపంగా మారాయి. సాక్షాత్తు న్యాయమూర్తి ఎదుటే అభంశుభం తెలియని చిన్నారిని తమకు సంబంధం లేదంటూ తల్లిదండ్రులు వదిలివెళ్లిపోయారు. విడాకుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈలోగా భరణంగా నెలకు 3వేల 500 రూపాయలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇందుకు సంతృప్తిచెందని బాలిక తల్లి ఎన్.విజయభారతి జడ్జి ఎదుటే బిడ్డను వదిలివెళ్లింది. తండ్రి కూడా తనకేమీ సంబంధం లేదంటూ వెళ్లడంతో న్యాయమూర్తి ఆ బిడ్డను శిశుమందిర్‌కు అప్పగించారు. కడప నగరం ఆకులవీధికి చెందిన ఎన్.విజయభారతి, ఎన్.ఈశ్వర్‌లు వివాహమయ్యాక కొంతకాలం అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత కాపురంలో కలతలు రావడంతో విడిపోయి కడప ఫ్యామిలీకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా తల్లి విజయభారతి విజ్ఞప్తి మేరకు తల్లిబిడ్డ జీవనాధారం నిమిత్తం న్యాయమూర్తి నెలకు రూ.3 వేల 500లు చెల్లించాలని భర్తను గురువారం ఆదేశించారు. అయితే ఇందుకు సంతృప్తిచెందని విజయభారతి తమ ఇద్దరికి ఈ భరణం సరిపోదని అంటూ 18నెలల బిడ్డ సాయికీర్తిని అక్కడే వదిలేసి వెళ్లింది. ఆ తర్వాత ఆమె భర్త ఈశ్వర్ కూడా తనకేమి పట్టనట్లుగా కోర్టు నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగాన్నంతా గమనిస్తున్న న్యాయమూర్తి అవాక్కయ్యారు. ఆ తర్వాత పోలీసులను పిలిపించి బిడ్డను శిశుమందిర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు శిశుమందిర్ అధికారులు వచ్చి ఆ బాలికను తీసుకెళ్లారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న న్యాయమూర్తి బిడ్డపట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆ తల్లిదండ్రులపై లోతుగా దర్యాప్తుచేయాలని ఆదేశించినట్లు తెలిసింది.