గుంటూరు

భూములివ్వని రైతులనే టార్గెట్ చేసిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, జనవరి 21: రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతుల పొలాల్లోనుండే ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ రూపొందించిందంటే రైతులను టార్గెట్ చేయటమేనని మంగళగిరి ఎంఎల్‌ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్లాన్‌ని నిరసిస్తూ గురువారం రైతులతోకలిసి పొలం పనిచేసి ఆయన నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌తో గ్రామాలకు ముప్పువాటిల్లటంతో పాటు పంటపొలాలు సైతం కనుమరుగువుతాయని, మంగళగిరి, తాడికొండ ప్రాంతాల్లో ప్రభుత్వం రైతులను బెదిరించి సుమారు లక్ష ఎకరాలను లాక్కుందని ఆరోపించారు. మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుల్లో సైతం రైతులడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలివ్వలేదని, ఇష్టపడి ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం సరిగా అందించలేదని అన్నారు. అంతేగాక ప్రభుత్వం రియల్టర్‌లకు అనుకూల చర్యలకు పాల్పడుతుంటే అధికారులు సహకరిస్తున్నారని, అటువంటి వారిపై నాయస్థానాల్లో కేసులు వేసి రైతులకు అండగా ఉంటామని ఆర్కే తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా ఫారాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాటిబండ్ల కృష్ణమూర్తి, వీరాంజనేయులు, సుబ్బారావు, రాఘవరావు, సత్యనారాయణ, చంద్రారెడ్డి, మేకా శివారెడ్డి, దంటు బాలాజీరెడ్డి, బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రభాకరరెడ్డి, గోవిందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అది కార్పొరేట్ వర్గాల మాస్టర్‌ప్లాన్: ఆర్కే
మంగళగిరి, జనవరి 21: సిఆర్‌డిఎ రూపొందించిన రాష్ట్ర రాజధాని అమరావతి నగర డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్ ప్రజారాజధానిగా కాకుండా కార్పొరేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దోపిడీ కోసం రూపొందించినట్లుగా ఉందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. గురువారం నాడిక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్ తయారీలో ప్రభుత్వం మరోసారి నమ్మి భూములిచ్చిన రైతులను నిలువునా ముంచిందన్నారు. గడిచిన ఏడాదికాలంలో రాజధానికోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులుగానీ, ముఖ్యమంత్రిగానీ రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోలేదని విమర్శించారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా కోర్టునాశ్రయించిన రైతుల భూములతో పాటు అసైన్డ్, లంక, ప్రభుత్వ భూములను ఏ విధంగా డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌లో కలిపారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని నిర్మాణంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దానికోసం భూములను త్యాగం చేసిన రైతులకు ఇంతదారుణంగా అన్యాయం చేసేవారు కాదన్నారు. గత కొద్ది రోజులుగా డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌పై నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాల్లో రైతులు, గ్రామస్థులు అధికారులను నిలదీస్తున్నా సామాధానాలు దాటవేస్తూ బూటకపు సదస్సులు నిర్వహించారని ఆర్కే విమర్శించారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునే డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్పొరేట్‌కంపెనీలకు మాత్రం 40, 50 అంతస్తులు కట్టుకోవడానికి అనుమతి ఇస్తూ భూములు త్యాగం చేసిన రైతులకు మాత్రం రెండు మూడు అంతస్తులు మాత్రమే అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు. పర్యాటక రంగం పేరిట కృష్ణానదీ తీరాన్ని తన బినామీలకు కట్టబెట్టి అక్కడ రైతులను మాత్రం ఎక్కడో పడేస్తారా అని నిలదీశారు. రాజధానిలో ఉన్న కౌలురైతులు, రైతుకూలీలు వ్యవసాయంపై ఆధారపడిన చేతివృత్తుల వారికి ఏం భద్రత కల్పిస్తారని ఆర్కే అన్నారు. బడా వ్యాక్తులకు సీడ్ క్యాపిటల్‌వద్ద స్థలాలు కేటాయించుకుని భూములిచ్చిన రైతులకు మాత్రం కొండవీటి ముంపు ప్రాతంలో నివాస స్థలాలు కేటాయించారని విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ సూచనలను రాష్ట్ర విభజన చట్టంలో చేసిన హామీలతో పాటు కేంద్రప్రభుత్వ సూచనలు, సలహాలు సైతం పక్కనబెట్టి విదేశీ సంస్థల్లోని తన బినామీలకు, అనుచరులకోసం చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారని, అది ప్రజారాజధాని కాదని, పెద్దల రాజధాని మాత్రమేనని ఆర్కే వ్యాఖ్యానించారు.