మహబూబ్‌నగర్

కృష్ణానది తీరంలో ఎల్లూరు వద్ద తొలిదశలో మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 22: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) పథకంకు మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన తొలిదశ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని అందించినప్పుడే వచ్చే ఎన్నికల్లో ఓట్ల అడిగేందు ప్రజల ముందుకు వస్తామని బహిరంగంగా సిఎం కెసిఆర్ ప్రకటించడం దాంతో వాటర్‌గ్రిడ్ పథకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కృష్ణాజలాలను వాటర్ గ్రిడ్‌కు ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. అందులో భాగంగా శ్రీశైలం జలాశయానికి సంబంధించి బ్యాక్ వాటర్‌ను మళ్లీంపు చేసుకుని మీషన్ భగీరథకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం యోచిస్తూ ప్రతిరోజు 6 టిఎంసిల నీటిని వాడుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. తొలిదశ మీషన్ భగీరథకు మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది తీరాన ఎల్లూరు దగ్గర ఇటివల మంత్రి తారక రామారావు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను వేగవంతం చేయడానికి అధికారులు రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎల్లూరు దగ్గర వాటర్ గ్రిడ్ పనులను చురుకుగా కొనసాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, వాటర్‌గ్రిడ్ ఇంచార్జి కృపాకర్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు పనులపై పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులకు మొత్తం రూ.6773 కోట్ల అంచనాలతో ప్రారంభించగా మొదటి విడతగా రూ.120 కోట్లు మంజూరు చేశారు. సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మీషన్ భగీరథ పనులు ఇప్పటికే జిల్లాలో ఎల్లూరు, జూరాలను రెండు సెగ్మెంట్లుగా చేర్చిన అధికారులు యుధ్దప్రతిపాదికన పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఐహెచ్‌పి, మెల్ కంపెనీలు పనులు చేపట్టాయి. మొదటి విడతగా రూ.120 కోట్లు మంజూరు కాగా అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా చురుకుగా కొనసాగుతున్నాయి. జూరాల సెగ్మెంట్‌కు సంబంధించి పనులను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసేందుకు కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదేవిధంగా ఎల్లూరు నుండి చేపట్టే వాటర్‌గ్రిడ్ పనులను మూడేళ్లలో పూర్తి చేసేందుకు అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నారు. ఎల్లూరు ఇన్‌టెక్ పనులకు రూ.120 కోట్లు మంజూరు చేయగా, రూ.700 కోట్లతో జూరాల సెగ్మెంట్ పనులను నిర్థారించారు. ఎల్లూరు నుండి నిర్వహించే మీషన్ భగీరథకు రూ.6073 కోట్లతో అంచనాలతో కూడిన పనులు జరగనున్నాయి. ఎల్లూరు దగ్గర నిర్మించే వాటర్ గ్రిడ్ రిజర్వాయర్‌కు ప్రభుత్వ, ప్రైవేటు భూములు మొత్తం 51.75 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 12.75 ఎకరాలు మాత్రమే సేకరించి పనులు చకచకగా కొనసాగిస్తున్నారు. జూరాలకు సంబందించి 14 ఎకరాల భూమిని సేకరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎల్లూరు వాటర్‌గ్రిడ్ పరిధిలోకి రాగా రెండు నియోజకవర్గాలు మాత్రం జూరాల పరిధిలోకి రానున్నాయి. అయితే ఎల్లూరు నుండే ప్రారంభమైన వాటర్‌గ్రిడ్‌ను రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్‌లోని కొన్ని నియోజకవర్గాలకు రూపకల్పన చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన తొలిదశ మీషన్ భగీరథ పథకం నుండి దక్షిణ తెలంగాణలోని దాదాపు 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు కృష్ణాజలాలను వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దాదాపు 3500 గ్రామాలకు ఇక్కడి నుండే తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. పలు రహదారుల సంబంధించి పైపు లైన్లు వేయడానికి అనుమతులను కూడా వివిధ శాఖలను కోరింది. రైల్వే బ్రిడ్జిల నుండి కూడా వాటర్‌గ్రిడ్ పైపులు వెళ్లనున్నడంతో కేంద్ర రైల్వేశాఖకు కూడా అధికారులు లేఖలు రాశారు.
రెండున్నర ఏళ్లలో పనులు పూర్తి చేస్తాం
* వాటర్ గ్రిడ్ అధికారి కృపాకర్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం మీషన్ భగీరథ పథకంను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎల్లూరు దగ్గర వాటర్‌గ్రిడ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఇక్కడి నుండి దాదాపు 4 జిల్లాల పరిధిలోని దాదాపు 27 నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని మరో 10 అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చే యోచనలో ప్రభుత్వం ఉందని వాటర్‌గ్రిడ్ ప్రత్యేక అధికారి కృపాకర్‌రెడ్డి ఆంద్రభూమి ప్రతినిధికి వెల్లడించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని ఇటివల సి ఎస్ రాజీవ్‌శర్మ కూడా వచ్చి పనులను పర్యవేక్షించారని ఎట్టి పరిస్థితుల్లో రెండున్నర ఏళ్లల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని దశల వారిగా పలు నియోజకవర్గాలకు నీరు అందుతుందని తెలిపారు.