తెలంగాణ

అక్రమ ఆయుధాలతో పట్టుబడిన ఎమ్మెల్యే సోదరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 30 : సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పోలీసులు ఆక్రమ ఆయుధాలు కలిగిన నల్గురు వ్యక్తులను ఆదుపులోకి తీసుకుని, మూడు తుపాకులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే సోదరుడు రాంచందర్, మరో వ్యక్తిని సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు, తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రేపాక స్వామిని అదుపులోకి తీసుకొని 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొండపాక మండలం సిర్సినగండ్ల గ్రామానికి చెందిన మంతురు నర్సింలు అనే వ్యక్తిని హైదరాబాద్‌లోని తార్నాక, నాచారం ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిద్దరి విచారణ అనంతరం నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే సోదరుడు రామచందర్, మరొక వ్యక్తిని శాలిగౌరారం మండలం ఉత్కోరు గ్రామంలో సిద్దిపేట పోలీసు కమిషనరేట్, హైదరాబాద్ టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకొని తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరికి గతంలో జనశక్తి పార్టీతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు తుపాకులు ఎక్కడి నుండి వచ్చాయని, నయాం ముఠాతో సంబంధాలున్నాయా, లేదా, జనశక్తి పార్టీకి సంబంధించినవా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసు విచారణ మొదటి నుండి పోలీసులు అధికారులు గోప్యంగా ఉంచుతుండటంతో అనుమానాలు తావిస్తుంది. ఈ విషయంపై సిద్దిపేట ఎసిపి నర్సింహారెడ్డిని విలేఖరులు సంప్రదించగా కేసు విచారణ జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సమాధానమిచ్చారు.
నాకు ప్రాణహాని:
మాజీ ఎమ్మెల్యే లింగయ్య
నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన సోదరుడు రామచంద్రయ్యను తుపాకి, రెండు గ్రెనేడ్లతో పాటు సిద్దిపేట పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడమే నిదర్శనమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేముల సోదరుడు రామచంద్రంతో పాటు బంధువులు విజయ్‌రెడ్డి, పెరికెకొండారం సర్పంచ్ రంగారెడ్డి, నరసింహాచారిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. గతంలో సైతం వారు రెండు దఫాలుగా ఆయుధాలతో పట్టుబడితే నరసింహాచారిపై కేసుపెట్టి వదిలేశారన్నారు. మరోసారి ఆయుధాలతో వేముల సోదరుడు, బంధువులు పట్టుబడగా కేసు నీరుగార్చేందుకు వేముల అధికారం అండతో సిద్దిపేట పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. గతంలో నక్సల్స్‌తో ఉన్న సంబంధాలను నేటికి వేముల వీరేశం కొనసాగిస్తూ ఆయుధాలతో అనుచరుల ద్వారా నకిరేకల్ నియోజకవర్గంలో బెదిరింపులు, సెటిల్‌మెంట్లకు, వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.