Others

షూటింగ్ అంటే మాటలా?.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక చిత్రం షూటింగ్ లేదా రికార్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుపటం పరిశ్రమలో ఆనవాయితీ. అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఆయా సంస్థల అభిరుచి, పలుకుబడి మీద ఆధారపడి ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం భారీగా జరుపుకుంటే, ఆ పబ్లిసిటీ ప్రభావం తరువాత వ్యాపారాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు. ఒక చిత్రానికి సంబంధించి హీరోపై క్లాప్ కొట్టే సన్నివేశాన్ని పరిశ్రమకు చెందిన మరో దిగ్గజంతో చేయించటమూ జరిగేది. అంటే, భారీ ప్రారంభోత్సవం సెంటిమెంట్ వ్యాపారాభివృద్ధికి ముడిపడి ఉండేదన్న మాట. అందుకే ఇలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్మాత, దర్శకులు తమకు అనుకూల స్టార్‌తో చేయిస్తుంటారు. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం (1977).. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల ద్వారా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామకృష్ణ. ఆయన హీరోగా నటించిన ‘స్వర్గానికి నిచ్చెనలు’ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను నిర్మాత రామచంద్రరావు హీరో రామకృష్ణచేతే నిర్వహించారు. ఆ సందర్భంలోనిదే ఈ ఫొటో. చిత్రంలో హీరో రామకృష్ణతోపాటు దర్శకుడు గోపాలకృష్ణ, నిర్మాత రామచంద్రరావును చూడొచ్చు. ఈ చిత్రం ప్రారంభోత్సవం రోజునే హీరో రామకృష్ణ, నటి ప్రభలపై ‘నీ కళ్లు చూశాను/ ఆ కళ్లలో మన ఇల్లు చూశాను’ పాట చిత్రీకరణ జరిపారు. ఆ పాట పాడింది ఎస్పీ బాలు. అక్కడకు వచ్చిన ఎస్పీ బాలు గంటపాటు ఓపికగా కూర్చుని ఘూటింగ్‌ను చూశారు. ఆ సందర్భంలో దర్శకుడితో మాట్లాడుతూ ‘ఒక షాట్ చిత్రీకరణకు ఇన్ని ప్రసవ వేదనలా. నా పనే బాగుంది. పాట పాడి వెళ్లిపోతాను. ఈ షూటింగ్ బాధలు నాకు లేవు’ అంటూ జోక్ చేశారు. చిత్రం ఏమిటంటే, ఆ తరువాతి కాలంలో ఎస్పీ బాలు నటిగాను, నిర్మాతగాను ఉన్నతస్థాయికి ఎదిగాడు. ఆ ప్రసవ వేదనలూ అనుభవించాడు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717