తెలంగాణ

పదవిలో మరో ఏడాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఇప్పటికే అత్యధిక కాలం గవర్నర్‌గా పని చేసిన రికార్డు సృష్టించిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌కు మరోసారి పొడిగింపు లభించింది. యుపిఏ హయాంలో నియమితులైన గవర్నర్ అయినప్పటికీ ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల వల్ల రెండవ సారి కూడా పొడిగింపు లభించింది.
ఎన్‌డి తివారి వివాదం బయటపడిన తరువాత 2009లో ఇంచార్జి గవర్నర్‌గా రాష్ట్రానికి వచ్చిన నరసింహాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇప్పుడు ఉభయ రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగే అవకాశం లభించింది. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా అనేక అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఇంకా అలానే ఉన్నాయి. ఆస్తుల పంపిణీ, జల పంపిణీ, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీ వంటి పలు అంశాల్లో ఎడతెగని వివాదం నడుస్తోంది. అనేకసార్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఓటుకు నోటు కేసు రెండు రాష్ట్రాల వివాదంగా ఉంది. కృష్ణా జలాల పంపిణీతో పాటు పలు ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాలు, రాష్టప్రతి పాలన అనుభవం, రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులతో పరిచయాల వంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని మరి కొంతకాలం నరసింహాన్‌ను కొనసాగించాలనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఉభయ రాష్ట్రాల పరిస్థితులే నరసింహన్‌కు కలిసి వచ్చాయి. సమస్యలను పరిష్కరించడంలో గవర్నర్ కీలక పాత్ర వహించాలి, సమస్యలు కొలిక్కి రాకపోవటం వల్లనే ఆయన్ని కొనసాగిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది.
ఉభయ రాష్ట్రాల మధ్య ప్రధానమైన వివాదాలు పరిష్కారం కావాలంటే కనీసం ఇంకా ఓ ఏడాది గడుస్తుంది. అప్పటి వరకు నరసింహన్‌కు ఢోకా లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.