నమ్మండి! ఇది నిజం!!

ఏప్రిల్ 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ 1912.
లండన్‌లోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఎమిలీ అకస్మాత్తుగా పెద్దగా అరుస్తూ నిద్ర లేచింది. వెంటనే మంచం దిగి తల్లి పడక గదిలోకి పరిగెత్తింది.
‘ఏమిటి?’ నిద్ర లేచిన ఆవిడ ఆదుర్దాగా అడిగింది.
‘మళ్లీ నీళ్లల్లో మునిగిపోయే ఆ కలే వచ్చింది. ఆ చల్లటి నీళ్ల స్పర్శ నాకు ఇంకా గుర్తుంది. మళ్లీమళ్లీ వచ్చే ఆ కల నిజమవుతుందేమోనని భయంగా ఉంది. లేకపోతే అన్నిసార్లు ఎందుకు వస్తుంది?’
‘నాలుగు రోజుల్లో నీ పెళ్లి. నువ్వు కలగనాల్సింది ఇది కాదు. నీ వెడ్డింగ్ గౌన్ గురించి, నిన్ను చేసుకునే ఎరిక్ గురించి, స్విట్జర్లాండ్‌లో గడపబోయే నీ హనీమూన్ గురించి. స్విట్జర్లాండ్‌లో ఈ సీజన్‌లో మంచు తప్ప మునగడానికి నీళ్లుండవు’ తల్లి అనునయంగా చెప్పింది.
మర్నాడు ఉదయం ఎమిలీ కాబోయే భర్త ఎరిక్ వాళ్లింటికి వచ్చాడు. ఎరిక్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఎమిలీకి ఓ కవర్ ఇచ్చాడు. అందులో వారి హనీమూన్ గడపడానికి అమెరికాలోని న్యూయార్క్‌కి వెళ్లే ఓడ టిక్కెట్లు కనిపించాయి. రాయల్ మెజిస్టీ షిప్ టైటానిక్‌లో 111బి కేబిన్. ఆ ఓడ నిర్మాణం తర్వాత అది దాని మొదటి ప్రయాణం అని కూడా ఆ టికెట్‌లో రాసి ఉంది.
‘నేను నమ్మలేకపోతున్నాను’ ఎమిలీ చెప్పింది.
‘టైటానిక్? దాని గురించి ఈ మధ్య పేపర్లో చాలా రాస్తున్నారు. అది ప్రపంచంలోని అతి పెద్ద ఓడ అని, అన్ని లగ్జరీలు ఉంటాయని, దానికి ఉన్న వాటర్‌టైట్ కంపార్ట్‌మెంట్ల వల్ల అది మునగదని రాసారు. దాని మొదటి ప్రయాణంలో టికెట్ దొరకడం అదృష్టం. రాజకీయవేత్తలు, మహారాజులు, అంతర్జాతీయ కళాకారులు మొదలైనవారు ప్రయాణిస్తున్నారుట’ తల్లి ఆనందంగా చెప్పింది.
ఎమిలీ ఆ అర్ధరాత్రి తల్లి గదిలోకి వచ్చి ఆమెని లేపి ఏడుస్తూ చెప్పింది.
‘నేనా ఓడలో వెళ్లను. నాకు మళ్లీ ఆ కల వచ్చింది. ఆ పెద్ద ఓడంతా మునిగిపోయి మనుషులు నీళ్లల్లో పడి కొట్టుకుంటూ తేలే ప్రయత్నం చేస్తూ మరణించడం కనిపించింది’
‘ఆ ఓడ టైటానిక్ అయి ఉండదు. అది ఎప్పటికీ మునగదు’
‘నేను అది మునగడం చూశాను. దాంట్లో వెళ్లను’ ఎమిలీ ఏడుస్తూ చెప్పింది.
మర్నాడు ఎరిక్ చెప్పాడు.
‘నీ కల గురించి తెలిసింది. అంతకు మునుపు వచ్చిన పీడ కలల గురించి కూడా’
‘మా అమ్మ చెప్పిందా? అది నా ఊహ కాదు. ఆ ఓడ మునగడం అనేకసార్లు నా కలలో కనిపించింది’
‘నువ్వు జిప్సీవైతే తప్ప కలల్లో కనిపించేవి నమ్మకూడదు. ఓ పీడకల వల్ల మన జీవితంలోని ఓ చక్కటి అనుభవాన్ని కోల్పోకూడదు’ అతను అనునయంగా చెప్పాడు.
చివరికి టైటానిక్ ఓడలో వారి ప్రయాణం ఆరంభమైంది.
‘్థంక్ యూ డార్లింగ్. నా జీవితంలోని ఆరు అద్భుతమైన రోజులు గడిచాయి’ ఓడ డెక్ మీద ఎమిలీ తన భర్తతో చెప్పింది.
‘ఈ ఆరు రోజులే కాదు. ముందు ముందు అన్ని రోజులూ మంచి రోజులే’
‘నా సిల్లీ కలలతో నేను రానన్నందుకు నన్ను క్షమించు’ ఆమె చెప్పింది.
* * *
ఆ రాత్రి టైటానిక్ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో వేగంగా ప్రయాణిస్తూంటే దూరంగా ఉన్న అనేక మందికి కూడా దానికి ప్రమాదం వాటిల్లచ్చనే సూచనలు అందాయి. కెనడాలో విన్నీపెగ్ అనే ఊళ్లోని మెథడిస్ట్ మినిస్టర్ మోర్గాన్‌కి కూడా అలా అనిపించడంతో తన అభిమాన హిమ్ కాకపోయినా ఆ రోజు చర్చ్‌లో హిమ్ (కీర్తన) మేథ్యూ 446 పాడమని భక్తులని కోరాడు. సముద్రంలో ప్రమాదంలో ఉన్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం’ అనే కీర్తన అది. చాలా మంది భక్తులు అలాంటి చలికాలంలో రైతుల గురించి ప్రార్థన చేసే కీర్తనని ఎందుకు పాడటం లేదు అనుకున్నారు కూడా.
సరిగ్గా అదే సమయంలో వెయ్యి మైళ్ల దూరంలో న్యూయార్క్‌లోని పత్రికలకి బొమ్మలు గీసే హేరీ టైలర్ గీసిన బొమ్మని చూసి అతని భార్య అడిగింది.
‘హేరీ! ఏమిటిది? నువ్వు పత్రికకి గీసే బొమ్మ కాదిది’
‘దీన్ని ఎలా గీసానో నాకే అర్థం కావటంలేదు. కాని ఇది నా కుంచె నించి వచ్చింది. ఏదో చెయ్యి నా చేత దీన్ని గీయించింది. ఇంతకు మించి నేను వివరించలేను’
అతను గీసిన బొమ్మలన్నిటిలోకీ అదే ఉత్తమమైనదని ఆమె చెప్పింది. ఆ బొమ్మ సముద్రంలో మునిగిపోయే టైటానిక్ బొమ్మ.
* * *
ఆ రాత్రి ఎమిలీ సరిగ్గా నిద్రపోలేదు. ఎరిక్‌కి మెలకువ వచ్చి చూస్తే ఆమె తన బట్టలన్నిటినీ షెల్ఫ్‌లోంచి తీసి కింద పడేయడం కనిపించింది. ఆమె ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్లుగా కనిపించింది.
‘నాకు మళ్లీ చల్లటి నీళ్లలో వణికే చాలామంది అరుపులు వినిపించాయి. వాళ్లకి ఇద్దామని వీటిని తీసాను.. నాకు పిచ్చెక్కుతోందా?’ ఆమె బాధగా అడిగింది.
కొద్ది నిమిషాల తర్వాత ఓడ కుదుపునకు వాళ్లిద్దరూ నేల మీద పడ్డారు. ఇంజన్ ఆగిపోయిందని గ్రహించి అతను విషయం తెలుసుకోవడానికి బయటకి వెళ్లాడు. ప్రయాణీకులంతా వెంటనే లైఫ్‌బోట్ స్టేషన్ దగ్గరకి వెళ్లమని స్పీకర్లో ప్రకటన వినిపించింది. వారు డెక్ మీదకి వెళ్లేసరికి అక్కడ మొదట ఆడవాళ్లని, పిల్లల్ని లైఫ్‌బోట్లలోకి ఎక్కిస్తున్నారు. తన భర్తని వదిలి వెళ్లటానికి ఎమిలీ ఆడవాళ్ల క్యూలో నిలబడటానికి ఇష్టపడకపోతే అతను బలవంతంగా ఎక్కించాడు. భర్తకి వీడ్కోలు చెప్పి ఆమె లైఫ్‌బోట్లో అయిష్టంగానే ఎక్కింది. ఆరు రోజుల ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఆ విధంగా వారి హనీమూన్ అంతమైంది.
ఆ రాత్రి ఆ ప్రమాదంలో 1500 మంది ప్రయాణీకులు టైటానిక్ ఓడతో పాటు మునిగి మరణించారు. వారిలో ఎమిలీ భర్త ఎరిక్ పార్లే ఒకరు.
టైటానిక్ అనే గొప్ప ఓడ మునగడానికి మునుపే పరోక్షంగా అనేకమందికి ఆ సంగతి తెలిసింది. ఎమిలీకి, విన్నీపెగ్ లోని మినిస్టర్‌కి, న్యూయార్క్‌లోని చిత్రకారుడికి ఆ ప్రమాదం గురించి ముందే ఎలా తెలిసింది? సమాధానం దేవుడికే తెలియాలి.
*