మహబూబ్‌నగర్

నీటివాటా కోసం ప్రభుత్వంపై యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, మే 10: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాలకు న్యాయపరంగా రావల్సిన నీటివాటా కోసం ప్రభుత్వంపై యుద్దానికి సిద్దంగా ఉన్నామని, నిరంకుశంగా అరెస్టులు చేస్తే బెదిరెది లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై గల డిండి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీఅద్వర్యంలో చేపట్టిన జలసాదన పోరుయాత్రను అనుమతి లేదంటూ పోలిసులు భగ్నం చేసి కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, టిపిసిసి అదికార ప్రతినిది కెవిఎన్‌రెడ్డితో పాటు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి వెల్దండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈసందర్బంగా ఎర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ పేరుకే కల్వకుర్తి ఎత్తిపోతల పథకమైన ఈప్రాంతానికి చుక్కనీరు రాకుండా పాలక ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తు కపటప్రేమను ప్రదర్శింస్తుదన్నారు. కెఎల్‌ఐ ద్వారా వచ్చే ఖరీప్ నాటికి సాగునీరివ్వకపోతే ప్రభుత్వం పై ప్రజలతో కలిసి యుద్దం చేస్తామన్నారు. కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాలకు న్యాయపరంగా రావల్సిన నీటి వాటాను అక్రమంగా ఇతర జిల్లాలకు తరలిస్తు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అరోపించారు. డిండి పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఓకే సోర్స్ ద్వారా నిర్మింస్తే రైతులు లీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కెఎల్‌ఐ ప్యాకేజీ ద్వారా కల్వకుర్తి అచ్చంపేట ప్రాంతాలకు రావల్సిన నీటి వాటా కోసం ప్రభుత్వం మెడలు వంచైన సాదించుకుంటామన్నారు. 2016 ఖరీప్ నాటికి సాగునీరందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటతప్పిందన్నారు. ఇది కేవలం అరంభం మీత్రమేనని భవిష్యత్తులో వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం పై నీటియుద్దాలు చేస్తామని హెచ్చరించారు. న్యాయబద్దంగా రావల్సిన సాగునీటి కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం ప్రభుత్వ పరాకష్టకు నిదర్శనమన్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అరెస్టులతో ఉద్యమాలను అపలేరని,బెదిరెది అంతకంటేలేదని అయన హెచ్చరించారు. ఈసమావేశంలోమాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, టిపిసిసి అదికార ప్రతినిది కెవిఎన్‌రెడ్డి, డిసిసి అదికార ప్రతినిది విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్, లక్ష్మారెడ్డి, పాండురంగారెడ్డి, షాకిర్, బంగారి, జంగయ్య, శేఖర్, మోతిలాల్‌నాయక్, రంజిత్, విశే్వశ్వర్ తదితరులు పాల్గొన్నారు.