గ్రహానుగ్రహం

ఆరూఢం.. కళత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటువంటి కళత్రం (్భర్య/్భర్త) వచ్చే అవకాశం ఉన్నది అనే అంశం ప్రస్తావిస్తే - కళత్రేశే చోపపదాదుచ్చస్థే స్వకులోత్తమాత్, దార లాభో భవేన్నీచే స్స్యాచ్చ నీచకులాద్భవేత్.. ఉపపదమునకు సప్తమాధిపతి ఉచ్ఛయందున్నచో తన వంశము కంటే ఉత్తమ వంశము నుండియు నీచయందున్న యెడల తన వంశము కంటే తక్కువ వంశము నుండియు దార లాభము కలుగును. సుందరీ శుభ సంబందాద్భార్యాస్సాదస్య ధాన్యధా - అపవాదాద్దారనాశ శ్శని రాహ్వన్యయే భవేత్.. ఉపపద సప్తమమునకు కానీ తదధిపతికి గానీ శుభ గ్రహ సంబంధం కలిగినేని భార్య రూపవతి యగును. అట్టి సంబంధం లేని యెడల కురూపి అగును. స్ర్తిజాతక శోధన చేయునప్పుడు భర్త అని చెప్పాలి. ఉపపద సప్తమమునకు తదధిపతికి శని రాహు సంబంధం కలిగినేని అపవాదుల వలన భార్యాభర్తలు విడిపోగలరు. నేడు కోర్టు గొడవల జాతకాలు శోధిస్తే ఈ అంశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇదే విషయం జాతకం రాశి చక్రం ద్వారా శోధించదలచిన యెడల వంధ్యాపతి స్సితరవీ మదనోదయస్థౌ చంద్రోదయే సమగృహే లలనా కృతిస్స్యాత్ పుంరాశిగే పురుష భావయుత కళత్రం స్ర్తిపుంగ్రహే క్షితయుతే సతి మిశ్రరూపం. శుక్ర సూర్యులు లగ్నంలో కానీ సప్తమంలో కానీ వుండిరేని భార్య గొడ్రాలు అగును అనగా సంతానవతి కానేరదు. రవి శుక్రుల కలయిక అస్తంగత్వ దోషం ఇస్తుంది కదా! మరి వారు అలాంటి దోషం కలవారై లగ్నంలో వుంటే కళత్ర స్థానమును చూస్తారు. కళత్రంలో వుంటే ఇక చెప్పనవసరం లేదు కదా. అందుకే ఈ ఫలితం చెప్పారు. ఇక చంద్రోదయము సమరాశులలో అయితే కళత్రము లలనాకృతి అగును అని చెప్పుచూ పురుష రాశిని పొందినేని కళత్రము పురుష భావం కలిగి వుండును అన్నారు. స్ర్తి పుంగ్రహములతో కూడికొని యుండినేని కళత్రము మిశ్రరూపము కలదై యుండును. ఈ సూత్రం పురుష జాతకం వరకే కాక స్ర్తి జాతకములకు కూడా అమలుచేయవలెను. మరొక ముఖ్య శోధన భౌమాంశేవా భౌమరాశౌమి లగ్నాత్. కామస్థానే జన్మభేవా వధూనామ్‌॥ జాయదాసీ నీచమూఢ గ్రహాంశే దుష్టావా స్యాద్యౌవనే భర్తృహీనాః పురుషుల జాతకంలో సప్తమ స్థానం స్ర్తిల జాతకంలో లగ్నం ద్వారా శోధించవలసిన అంశము ఇది. పురుషుల సప్తమ స్థానము లేదా స్ర్తిలకు లగ్నము అంగారక రాశిగానీ అంశ గానీ అయిన యెడల భార్య దాసీయై ఉండును. అలాగే సప్తమము అయినను, లగ్నము అయినను నీచ మూఢ గ్రహాంశలు కలది అయిన యెడల కళత్రము (్భర్య/్భర్త) యుక్త వయసులో వుండగా దుష్ట స్వభావము కలది అయి ఉండును. లేదా భర్తృహనురాలు అయి ఉండును. ఇది పురుష జాతకమునకు కూడా అమలు చేయవచ్చును. శుభాంశ రాశౌయది సద్గుణాఢ్యా శుభౌక్షితే చారుతరం కళత్రం - చంద్రాంశకే దుర్బల చంద్రరాశౌ జాతాపతిఘ్నీ సబలేతు సాధ్వీ॥ సప్తమము గానీ లగ్నము గానీ శుభాంశరాశి అయ్యెనేని భార్య సద్గుణవతి అగును. సప్తమ స్థానము శుభ గ్రహములచే చూడబడెనేని మిగుల సుందరి అయిన భార్య రాగలదు. ఈ నియమం భర్త రాగలడు అని చెప్పవచ్చు. సప్తమ స్థానము చంద్రరాశి అయి వుండగా చంద్రరాశి దుర్బలమయి ఉండెనేని పతిని హింసించునట్టి, భార్య కలుగును. అదే చంద్రరాశి బలము కలది అయిన యెడల భార్య పతివ్రత అగును. లగ్నాధిపతి సప్తమ స్థానమున ఉండి శుభ గ్రహములతో కూడుకొని ఉన్న యెడల సత్కులమునందు పుట్టిన భార్య రాగలదు. లగ్నాధిపతి దుష్ట క్షేత్ర ఆధిపత్యంతో వున్న సప్తమంలో వున్ననూ లేదా దుష్ట గ్రహములతో కలసి సప్తమంలో వున్ననూ దుష్టకులము నందు పుట్టిన భార్య రాగలదు.
‘కామస్థేతనుపే శుభగ్రహయుతే సద్వంశ జామృచ్ఛతి
క్రూరర్షే మదగ్నే మిగ్నే రమణే దుర్వంశ జాతాంగనామ్‌॥
**************

వి.మాధవశర్మ (హైదరాబాద్)
ప్రశ్న: ఆరూఢం, అష్టకవర్గు, రాశి చక్రాల ద్వారా వివిధ కోణాలలో పరిశీలనలు తెలిపారు కదా? ఈ ఫలితాంశములు అన్నింటికీ మధ్య సమన్వయం ఉంటుందా?
జ: వాటి మధ్య సమన్వయం ఉన్నది. గ్రంథం మొత్తం చదివితే కానీ పూర్తి అనుమానాలు ఎలాగ తీరవో.. అదే రీతిగా శాస్త్రం గురుముఖతః మొత్తం చదివితే అవగాహన వస్తుంది. రాశి చక్రం లేనిదే ఈ అష్టకవర్గు, ఆరూఢం నిర్మాణం జరుగవు అని తెలుసు కదా. ఇక ఫలితాంశాలు కూడా అదే రీతిగా ఉంటాయి అని చెప్పాలి.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336